PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections41e1d005-95c9-4b24-a33e-5e7dfd10aced-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections41e1d005-95c9-4b24-a33e-5e7dfd10aced-415x250-IndiaHerald.jpgఎన్నికల టైంలో ప్రచారాలు అంటే... సమావేశాలు, భోజన ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, బ్యానర్లు, పూల దండలు పువ్వులు, పోస్టర్లు, జెండాలు అని.. ఇలా రకరకాల వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా.. ఇదే తరహాలో గ్రామపంచాయతీ ఎలక్షన్స్ కోసం కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారుjagan-nimmagadda-elections;andhra pradesh;panchayati;assembly;population;election;local languageజగడ్డ: పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సింది ఇంతే...?జగడ్డ: పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సింది ఇంతే...?jagan-nimmagadda-elections;andhra pradesh;panchayati;assembly;population;election;local languageThu, 04 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రామాల్లో , పట్టణాల్లో ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. స్థానిక ఎన్నికల గురించే గుసగుసలు వినబడుతున్నాయి.  ఏకగ్రీవంపై భిన్న అభిప్రాయాలు, నాయకులు విమర్శలు, నామినేషన్ల వివరాలు. ఇది ప్రస్తుతం ఏపీ లో నడుస్తున్న ట్రెండ్. గ్రామాల్లో ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఓ వైపు అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మరో వైపు  కార్యకర్తలు, వారి అభిమాన జనం తమ తమ నాయకుల కోసం ప్రచారాలను ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు అనగానే గుర్తొచ్చే కొన్ని ముఖ్యమైన విషయాల్లో డబ్బు కూడా ఒకటి. ఎన్నికలకు ముందు ప్రచారాల సమయంలో డబ్బులు అలవోకగా  ఖర్చు చేస్తారు పోటీదారులు.

ఎన్నికల టైంలో ప్రచారాలు అంటే... సమావేశాలు, భోజన ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, బ్యానర్లు, పూల దండలు పువ్వులు, పోస్టర్లు, జెండాలు అని.. ఇలా రకరకాల వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా.. ఇదే తరహాలో గ్రామపంచాయతీ ఎలక్షన్స్ కోసం కూడా డబ్బులు ఖర్చు చేస్తున్నారు పోటీదారులు. అయితే ఇందుకు లక్షలు కుమ్మరిస్తున్నారట. కానీ వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కోసం ఎంత వరకు ఖర్చు చెయ్యొచ్చనే పరిధిపై ఎన్నికల సంఘం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 10 వేలకు మించి జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, వార్డు అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.50 వేలకు మించి ఖర్చు చేయకూడదని స్పష్టం చేసింది.

ఇక 10వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు మెంబర్లుగా పోటీపడే అభ్యర్థులైతే రూ.30 వేలు వరకు ఖర్చు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.  కానీ ఇటు గ్రామాల్లో చూస్తుంటే... అంతకుమించి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పరిమితికి మించిన డబ్బులను ఖర్చు చేస్తున్నారట పోటీదారులు. నిజానికి ఇది సదామామూలే.. నిర్ణయించేది ఒకటైతే ఖర్చు చేసేది మరొకటి ఉంటుంది అని విశ్లేషకుల అభిప్రాయం. కాకపోతే పరిమితికి మించిన ఖర్చును వారి బంధువులో లేదా కార్యకర్తల ఖాతాల్లోకి తోసేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల జోరు మామూలుగా లేదని తెలుస్తోంది. కొన్నిచోట్ల అయితే అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో హోరెత్తిస్తున్నట్లు సమాచారం.


ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>