PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/us-warns-china-on-border-issue-with-india-first-ti66882f74-0af5-45ed-9393-2bd5c7b03101-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/us-warns-china-on-border-issue-with-india-first-ti66882f74-0af5-45ed-9393-2bd5c7b03101-415x250-IndiaHerald.jpgచైనా తన పొరుగు దేశాలను బెదరించడానికి, భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది'' ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మా ఉమ్మడి ప్రయోజనాలను, భద్రతను, సంపదను కాపాడుకోవడానికి మేము మా స్నేహితులకు, భాగస్వాములకు, మిత్ర దేశాలకు అండగా నిలుస్తాం'' మేము చాలా సన్నిహితంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాం. భారత, చైనా ప్రభుత్వాల మధ్య సాగుతున్న చర్చలను కూడా గమనిస్తున్నాం. ఈ చర్చలు కొనసాగడానికి, చర్చలద్వారా సరిహద్దు సమస్య పరిష్కారం కావడానికి మా వంతు సహకారం అందిస్తాం''us warns china on border issue with india first ti;auto;mithra;india;malaysia;american samoa;january;internationalజగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్us warns china on border issue with india first ti;auto;mithra;india;malaysia;american samoa;january;internationalThu, 04 Feb 2021 15:00:00 GMT''చైనా తన పొరుగు దేశాలను బెదరించడానికి, భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది''



''ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో మా ఉమ్మడి ప్రయోజనాలను, భద్రతను, సంపదను కాపాడుకోవడానికి మేము మా స్నేహితులకు, భాగస్వాములకు, మిత్ర దేశాలకు అండగా నిలుస్తాం''



''మేము చాలా సన్నిహితంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాం. భారత, చైనా ప్రభుత్వాల మధ్య సాగుతున్న చర్చలను కూడా గమనిస్తున్నాం. ఈ చర్చలు కొనసాగడానికి, చర్చల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారం కావడానికి మా వంతు సహకారం అందిస్తాం''




పై విషయాలు చాలు, భారత్ పట్ల ఆమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ వైఖరి ఏమిటో  స్పష్టం కావటానికి. ఇరుగు పొరుగు దేశాలతో అయిందానికి, కాందానికి గిల్లికజ్జాలు పెట్టుకుంటుంది చైనా. ఇదేమి కొత్త విషయం కాదు. దాని "జీన్స్ మ్యుటేషన్" చెందటం ద్వారా వచ్చిన అలవాటని సర్దుకోలేం. ఎందుకంటే ఇది వారి దేశ భూభాగాలను నయాన్నో భయాన్నో కబ్జా చేయటానికి అదెప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. తొలుత చైనా ఒక కిలో మీటర్ ప్రక్క దేశం భూభాగంలోకి చొచ్చుకు పోయి వాళ్ళు ప్రతి దాడి చేయవస్తే ఒక పావు కిలో మీటర్ కొట్టేసి ముప్పావు కిలోమీటర్ తిరిగి ఇచ్చేసే "సలాం స్లైసింగ్" విధానం అది అనుసరిస్తుంది.  అందుకే చైనా ఒక కిలోమీటర్ ప్రక్క దేశం భూభాగంలోకి చొచ్చుకు వస్తే మనం రెండు కిలోమీటర్లు దూసుకు పోవాలన్నా మాట.




అయితే భారత-చైనా సరిహద్దు వివాదంపట్ల అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం మొదటిసారిగా స్పందించింది. పొరుగు దేశాలను బెదరించడానికి, భయపెట్టడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపట్ల బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిని తాము అతి  దగ్గరగా పరిశీలిస్తున్నట్టు అది పేర్కొంది.




వ్యూహాత్మకంగా తమకెంతో కీలకమైన “ఇండో పసిఫిక్‌ ప్రాంతం”లో తమ ఉమ్మడి విలువలను మెరుగు పరచుకోవడంలో తమ మిత్ర దేశాలకు అమెరికా పూర్తిగా అండగా ఉంటుందని బైడెన్‌ ప్రభుత్వం లోని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.




''మేము అతి దగ్గరగా పరిస్థితిని సమీక్షిస్తున్నాం భారత, చైనా ప్రభుత్వాల మధ్య సాగుతున్న చర్చలను కూడా దగ్గరగా గమనిస్తున్నాం. ఈ చర్చలు కొనసాగడానికి, చర్చల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారం కావడానికి మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తాం'' అని వైట్‌ హౌస్‌కు చెందిన “జాతీయ భద్రతా మండలి” అధికార ప్రతినిధి, ఎమిలీ జె. హార్న్‌ తెలిపారు. ఇటీవల చైనా సైన్యం భారత భూభాగంలో చొరబడడం, అలజడి సృష్టించటంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 




''చైనా తన పొరుగు దేశాలను బెదరించడానికి, భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు. 



''ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో తమ, తమ మిత్ర దేశాల ఉమ్మడి ప్రయోజనాలను, భద్రతను, సంపదను కాపాడుకోవడానికి మేము స్నేహితులకు, భాగస్వాములకు, మిత్ర దేశాలకు అండగా నిలుస్తాం'' అని హార్న్‌ నొక్కి చెప్పారు. భారత, చైనా సరిహద్దు ఘర్షణల మీద బైడెన్‌ ప్రభుత్వం ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారి. జో బైడెన్‌ గత జనవరి 20 న అమెరికా కొత్త అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేశారు.




భారత, చైనాలు గత ఏడాది మే 5 నుంచి ఉత్తర లడాఖ్‌ ప్రాంతంలో ఘర్షణలకు తలపడుతున్నాయి. ఈ రెండు దేశాలు సైనికపరంగా, దౌత్యపరంగా అనేక పర్యాయాలు చర్చలు జరిపాయి కానీ, సమస్య పరిష్కారంలో పురోగతి సాధించలేకపోయాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా సైన్యం తిష్ఠ వేయడం అంతర్జాతీయంగా, వివిధ దేశాల మధ్య ఒక చర్చనీయాంశంగా మారింది. 




దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాలలో చైనా తన పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలలో నిమగ్నమై ఉంది. అక్కడి ద్వీపాలలో భారీ సంఖ్యలో సైనికులను దించింది. దక్షిణ చైనా సముద్రమంతా తమ దేనని చైనా మొదటి నుంచీ వాదిస్తోంది. అయితే, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, బ్రూనే, మలేషియా, తైవాన్‌లు చైనా వాదనను తోసి పుచ్చుతున్నాయి. 




చైనా సముద్రం తూర్పు వైపున కూడా చైనా కు జపాన్‌ తో సరిహద్దు వివాదం ఉంది. చైనా వాదనతో ఏకీభవించని అమెరికా ఆ సముద్ర ప్రాంతంలో తన యుద్ధ నౌకలను మోహరించి, ఆయా దేశాల ప్రయోజనాలకు అండగా నిలుస్తోంది.







రెచ్చిపోయిన క్రిస్ గేల్.. ఇరవై రెండు బంతుల్లో ఎన్ని పరుగులో తెలుసా..?

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>