PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-chandra-babu9f15f579-6956-4f04-889c-5bdc7a5a17b5-415x250-IndiaHerald.jpgవాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు సీటు ఇచ్చారు. ఆయ‌నేంటో పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే కాదు.. పార్టీ కేడ‌ర్‌కు కూడా అర్థం కాలేదు. ఎన్నిక‌ల్లో ఓడినా ఆయ‌న మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వ‌ద‌ల్లేదు.. ఎన్నిక‌ల్లో గెలిచిన వారు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని.. ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడే వాళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గం గుర్తొచ్చిన‌ట్లుంది. ఇప్పుడు ఇదే విష‌యం క‌ళ్యాణదుర్గంలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.tdp chandra babu;tiru;usha;telugu;letter;tdp;local language;josh;partyఅనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?tdp chandra babu;tiru;usha;telugu;letter;tdp;local language;josh;partyThu, 04 Feb 2021 12:20:00 GMTఅనంత‌పురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌ళ్యాణ‌దుర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి సంస్థాగ‌తంగా కూడా తిరుగులేని బ‌లం ఉంది. అలాంటి చోట గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం గ్రూపు త‌గాదాల‌తోనే టీడీపీ ఓడిపోయింది. అస‌లు వైసీపీలోనే చాలా మందికి తెలియ‌ని ఉషా శ్రీ చ‌ర‌ణ్ ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నిక‌ల‌లో గెలిచిన యేడాది కాలంలోనే ఆమె సొంత పార్టీలోనే తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త కొని తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ టీడీపీలో ఎక్క‌డా లేని జోష్ కనిపిస్తోంది. క‌ళ్యాణ‌దుర్గంలో గ‌త ఎన్నిక‌లలో పోటీ చేసిన ఉమా మ‌హేశ్వ‌ర నాయుడు కేవ‌లం సొంత పార్టీలోని గ్రూపు త‌గాదాల‌తోనే ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఉమామ‌హేశ్వ‌ర్ నాయుడు ఎప్పుడూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉన్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల చివ‌రి క్ష‌ణంలోనే ఆయ‌న‌కు చంద్ర‌బాబు సీటు ఇచ్చారు. ఆయ‌నేంటో పూర్తిగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లే కాదు.. పార్టీ కేడ‌ర్‌కు కూడా అర్థం కాలేదు. ఎన్నిక‌ల్లో ఓడినా ఆయ‌న మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వ‌ద‌ల్లేదు.. ఎన్నిక‌ల్లో గెలిచిన వారు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని.. ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేశారు. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో ఇప్పుడే వాళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గం గుర్తొచ్చిన‌ట్లుంది. ఇప్పుడు ఇదే విష‌యం క‌ళ్యాణదుర్గంలో చ‌ర్చ‌కు వ‌స్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో క‌ళ్యాణ‌దుర్గం న‌గ‌ర పంచాయ‌తీతో పాటు బ్ర‌హ్మ‌స‌ముద్రం, శెట్టూరు, క‌ళ్యాణ‌దుర్గం, కుందుర్తి, కంబ‌దుర్రు మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న మొత్తం 74 పంచాయ‌తీల్లో ఇప్పుడున్న సంక్లిష్ట ప‌రిస్థితుల్లో కూడా టీడీపీ 40 - 50 పంచాయ‌తీల్లో జెండా ఎగ‌ర‌వేసే ఛాన్సులు ఉన్న‌ట్టు జిల్లాలో చ‌ర్చ న‌డుస్తోంది. ఉమామ‌హేశ్వ‌ర నాయుడు స్థానిక ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని స‌ర్పంచ్ అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌తో పాటు ప్ర‌చార ప‌ర్వంలో కూడా పాల్గొని టీడీపీ కేడ‌ర్‌లో కొత్త జోష్ నింపుతున్నారు.

స‌ర్పంచ్‌లుగా పార్టీ సానుభూతిప‌రులుగా పోటీ చేసేవారిని ఎంపిక చేసే క్ర‌మంలో గ్రామాల్లో స‌మావేశాలు పెట్టి క్లీన్ ఇమేజ్ ఉన్న‌వారినే ఎంపిక చేస్తున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు పార్టీకి కంచుకోట‌గా ఉన్న అనంత‌పురం జిల్లాలో తాజా ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ పై చేయి సాధించే ఛాన్సులు ఉన్నాయి. అందులో క‌ళ్యాణదుర్గం కూడా ఫ‌స్ట్ ప్లేసులో క‌నిపిస్తోంది. మ‌రి ఫైనల్ రిజ‌ల్ట్ ఎలా ?  ఉంటుందో ?  చూడాలి. 


బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>