MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajasekhara6a8eb02-67f1-4a74-a531-5657ccf750d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajasekhara6a8eb02-67f1-4a74-a531-5657ccf750d4-415x250-IndiaHerald.jpgరాజశేఖర్ అంటే యాంగ్రీ యంగ్ మాన్ అని బిరుదు ఉంది. ఆయన తనదైన స్టైల్ లో నటిస్తారు. ఆయనకంటూ ఒక మ్యానరిజం ఉంది. ఆయన సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. రాజశేఖర్ తమిళుడు అయినా తెలుగులోనే నటిస్తూ ఇక్కడ హీరోగానే సెటిల్ అయిపోయారు. rajasekhar;chiranjeevi;dr rajasekhar;jeevitha rajaseskhar;cinema;telugu;tamil;audience;director;doctor;traffic police;allari;ankushamస్టార్ హీరోలకు దడ పుట్టించిన రాజశేఖర్...?స్టార్ హీరోలకు దడ పుట్టించిన రాజశేఖర్...?rajasekhar;chiranjeevi;dr rajasekhar;jeevitha rajaseskhar;cinema;telugu;tamil;audience;director;doctor;traffic police;allari;ankushamThu, 04 Feb 2021 11:00:00 GMTరాజశేఖర్ అంటే యాంగ్రీ యంగ్ మాన్ అని బిరుదు ఉంది. ఆయన తనదైన స్టైల్ లో నటిస్తారు. ఆయనకంటూ ఒక మ్యానరిజం ఉంది. ఆయన సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. రాజశేఖర్ తమిళుడు అయినా తెలుగులోనే నటిస్తూ ఇక్కడ హీరోగానే సెటిల్ అయిపోయారు.

రాజశేఖర్ వందేమాతరం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు. అంతకు ముందు ఆయన తమిళంలో అనేక సినిమాలు చేశారు. ఇక రాజశేఖర్ జీవితంలో ఆయనకు మేలు మలుపు ఇచ్చిన చిత్రం స్టార్ డమ్ ని  తెచ్చిన మూవీగా అంకుశం ని చెప్పుకోవాలి. అప్పట్లో అంకుశం ఎంత పెద్ద హిట్ అంటే ప్రతీ పోలీస్ ఆఫీసర్ రాజశేఖర్ గా ఉండాలనుకునేవారు.

ఆయనలాగానే బిహేవ్ చేసేవారు. ఆయన ప్రభావం మొత్తం పోలీస్ వ్యవస్థ మీద 1980 దశకంలో బాగా పడింది. పోలీస్ పాత్ర అంటే రాజశేఖర్ అన్నట్లుగా పీక్స్ కి తీసుకువెళ్లిన చిత్రమది. ప్రముఖ డైరెక్టర్ కోడి రామక్రిష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత ఒక్కసారిగా రాజశేఖర్ కి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ సమయంలో తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ స్టార్ డమ్ తో వెలుగుతున్నారు. వారికి పోటీగా రాజశేఖర్ కూడా అలా దూసుకువచ్చాడు.

అయితే రాజశేఖర్ ఆ తరువాత ఎంచుకున్న కధలు కొన్ని తేడా కొట్టడంతో పాటు ఆయన సినిమాలను అంకుశంతో పోలుస్తూ జనాలు కూడా ఆ ఇంపాక్ట్ నుంచి బయటకు రాకపోవడంతో రాజశేఖర్ కి కొంత ఇబ్బంది అయింది. ఇక 1990 దశకంలో టాప్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రాజశేఖర్ మరో యాంగిల్ లో కనిపించి అల్లరి ప్రియుడుగా జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. యాంగ్రీ యంగ్ మాన్ పాత్రలు వేసే రాజశేఖర్ లో  ఇంత అల్లరి ప్రేమికుడు ఉంటాడా అనిపించేలా ఈ సినిమా కూడా టాప్ రేంజి హిట్ అయింది. దాంతో మళ్లీ టాప్ రేస్ లోకి రాజశేఖర్  దూసుకువచ్చాడు.

రాజశేఖర్ కెరీర్ లో మగాడు సినిమా కూడా పెద్ద హిట్. అలాగే ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఆడియన్స్ మన్ననలు పొందారు. మొత్తానికి డాక్టర్ చదివి యాక్టర్ కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చి టాప్ రేంజికి చేరుకోవడం అంటే మాటలు కాదు, కానీ రాజశేఖర్ డాక్టర్ గానే కాదు యాక్టర్ గానూ సూపర్ హిట్ అనిపించుకున్నాడు. ఈ రోజు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా మరిన్ని హిట్లు ఆయన నుంచి రావాలని అంతా కోరుకుంటున్నారు.




అమ్మో... ఆయన కోసం కేటిఆర్ పదవి రెడీ చేసారా...? కేసీఆర్ చెప్పేసారా...?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>