PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9ec7d95b-68af-43c8-bc64-17bc7e779254-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9ec7d95b-68af-43c8-bc64-17bc7e779254-415x250-IndiaHerald.jpgఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఈలి నాని వైసీపీ నేత‌ల‌తో.. ఆ పార్టీ మంత్రుల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ ఉండ‌డంతో గూడెంలో టీడీపీ స‌ర్వ‌నాశ‌నం అయిపోయింది. కొంత కాలంగా అక్క‌డ పార్టీ జెండా ప‌ట్టే నాథుడు లేడు. చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు అక్క‌డ సీనియ‌ర్ నేత‌గా ఉన్న వ‌ల‌వ‌ల మ‌ల్లిఖార్జున రావు ( బాబ్జీ) ని పార్టీ ఇన్‌చార్జ్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గూడెం టీడీపీకి కొత్త ఇన్‌చార్జ్‌ను నియ‌మించ‌డంతో పార్టీలో ఎక్క‌డా లేని కొత్త tdp flag;nani;tiru;bharatiya janata party;congress;district;telugu;mla;minister;letter;tdp;ycp;eluru;kovvur;pinnamaneni babji;josh;party;mantraప‌శ్చిమ టీడీపీలో ఆ నేత‌కు ప‌ద‌వి... 25 ఏళ్ల‌కు అయినా జెండా ఎగిరేనా ?ప‌శ్చిమ టీడీపీలో ఆ నేత‌కు ప‌ద‌వి... 25 ఏళ్ల‌కు అయినా జెండా ఎగిరేనా ?tdp flag;nani;tiru;bharatiya janata party;congress;district;telugu;mla;minister;letter;tdp;ycp;eluru;kovvur;pinnamaneni babji;josh;party;mantraThu, 04 Feb 2021 10:09:00 GMTప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గం గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా ఎప్పుడూ క‌లిసి రావ‌డం లేదు. చిట్ట చివ‌రిగా ఇక్క‌డ 1999లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన య‌ర్రా నారాయ‌ణ స్వామి విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి ఇక్క‌డ పార్టీ గెల‌వ‌లేదు. 2004లో కాంగ్రెస్ నుంచి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, 2009లో ప్ర‌జారాజ్యం నుంచి ఈలి నాని, 2014లో బీజేపీ నుంచి మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల రావు, 2019లో వైసీపీ నుంచి కొట్టు స‌త్య‌నారాయ‌ణ గెలిచారు. 1999లో టీడీపీతో క‌లిపితే గ‌త ఐదు ఎన్నిక‌ల‌లో ఇక్క‌డ ఐదు పార్టీలు గెలిచాయి. దీనిని బ‌ట్టి గూడెం ఓట‌రు విల‌క్ష‌ణ‌మైన తీర్పు ఇస్తున్నాడు. 2014లో బీజేపీ టీడీపీ మ‌ద్ద‌తుతోనే గెలిచింది.

ఇక టీడీపీ ఇక్క‌డ ఎప్పుడూ వీక్‌గానే ఉంటోంది. 2009లో ప్ర‌జారాజ్యం వ‌చ్చిన‌ప్పుడు ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది. అలాంటి సంక్లిష్ట నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల‌లో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. చివ‌ర‌కు ఈలి నాని వైసీపీ నేత‌ల‌తో.. ఆ పార్టీ మంత్రుల‌తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ ఉండ‌డంతో గూడెంలో టీడీపీ స‌ర్వ‌నాశ‌నం అయిపోయింది. కొంత కాలంగా అక్క‌డ పార్టీ జెండా ప‌ట్టే నాథుడు లేడు. చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు అక్క‌డ సీనియ‌ర్ నేత‌గా ఉన్న వ‌ల‌వ‌ల మ‌ల్లిఖార్జున రావు ( బాబ్జీ) ని పార్టీ ఇన్‌చార్జ్‌గా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

గూడెం టీడీపీకి కొత్త ఇన్‌చార్జ్‌ను నియ‌మించ‌డంతో పార్టీలో ఎక్క‌డా లేని కొత్త జోష్ నెల‌కొంది. ఇక ఇప్ప‌టికే ఏలూరులో కూడా మాజీ ఎమ్మెల్యే బుజ్జి హ‌ఠాన‌ర్మ‌ర‌ణంతో ఆయ‌న సోద‌రుడు చంటికి పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. ఇక పార్టీ ఇన్‌చార్జ్‌లు లేని కొవ్వూరుతో పాటు ఇన్‌చార్జ్‌లు యాక్టివ్‌గా లేని భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, చింత‌ల‌పూడికి కూడా కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించాల‌ని జిల్లా పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. 


కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>