PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections117930ba-daef-4295-b929-a7b6bf3f6cc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections117930ba-daef-4295-b929-a7b6bf3f6cc9-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇపుడు ఏపీలో అందరిలో మారు మోగుతున్న పేరు. ఆయన ఎక్కడికక్కడ పర్యటనలు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలో స్వయంగా తిరిగి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కంట్రోల్ లోకి తీసుకుని తాని నిక్కచ్చిగా ఉంటూ ఎన్నికలను సజావుగా జరిపేలా కఠిన చర్యలే అమలు చేస్తున్నారు. jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;local language;ycp;march;t n sheshanజగడ్డ : వైసీపీకి చుక్కలు చూపిస్తున్న నిమ్మగడ్డ...?జగడ్డ : వైసీపీకి చుక్కలు చూపిస్తున్న నిమ్మగడ్డ...?jagan-nimmagadda-elections;amala akkineni;kumaar;local language;ycp;march;t n sheshanThu, 04 Feb 2021 10:00:00 GMT
దీంతో అధికార వైసీపీకి ఏ మాత్రం మింగుడు పడడంలేదు. గత ఏడాది మార్చి లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నీకల వేళ పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకుని లాభపడిన వైసీపీకి ఈసారి నిమ్మగడ్డ నిక్కచ్చితనం ఒక్క అడుగు కూడా ముందుకు పోనీయకుండా చేస్తోంది. మొత్తానికి తీసుకుంటే తొలి దశలో  3,249 గ్రామ పంచాయ‌తీలు, 32,504 వార్డు స్థానాల‌కు ఎన్నిక‌లు జరుగుతూంటే  ఇప్ప‌టి వ‌ర‌కూ 100 స్థానాల‌కు మించి ఏక‌గ్రీవాలు అయిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.  దీంతో ఈ పరిణామాలు అధికార పార్టీలో అతి పెద్ద చర్చగా మారుతున్నాయి. ఎన్నికల సంఘం అంటే ఏంటో నిమ్మగడ్డ అక్షరాలా వైసీపీ పెద్దల కళ్లకు కట్టినట్లుగా చూపించారని అంటున్నారు.

పవర్ ఇలాగే ఉంటుంది. నాడు దేశానికి  శేషన్ వచ్చే వరకూ విచ్చలవిడిగా చెలరేగిపోయినా వారికి గట్టి కొరడా తెచ్చి తగిన పాఠం చెప్పారు. అప్పటిదాకా ఎన్నికల సంఘానికి ఇన్ని అధికారాలు ఉంటాయని ఎవరికీ తెలియదు. ఇపుడు చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పుణ్యామాని స్థానిక ఎన్నికలల్లో ఇంతలా నిబంధనలు ఉంటాయా అని అందరూ తెలుసుకుంటున్నారు. అన్నింటి కంటే ముఖ్య విషయం ఏంటి అంటే ప్రతీ చోటా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. దానికి కారణం నిమ్మగడ్డ అని కచ్చితంగా చెప్పుకోవాలి. మొత్తానికి వైసీపీ వారి ఆగడాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ చుక్కలు చూపించడంతో నిమ్మగడ్డ ది గ్రేట్ అనిపించుకున్నారు. ఇలాగే మొత్తం ఎన్నికలు జరిగితే ప్రజాభిప్రాయం పక్కా క్లారిటీగా వస్తుంది అని అంతా అంటున్నారు.






చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>