PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsffdf9e84-a829-468a-a01a-321c36dfd241-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsffdf9e84-a829-468a-a01a-321c36dfd241-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నను అరెస్టు చేసినప్పుడు ఆయన కొట్టిన ఓ డైలాగ్ ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అచ్చెన్న ఏమన్నారంటే.. నామీద కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తిని కాదు. స్థానిక డీఎస్పీ, సీఐ వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్లీ ఛాలెంజ్‌ చేస్తున్నాను. తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోంమంత్రి పదవి నేనే తీసుకుంటాను. ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నవjagan-nimmagadda-elections;cbn;jagan;andhra pradesh;vishakapatnam;assembly;minister;tdp;local language;nijam;partyజగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?jagan-nimmagadda-elections;cbn;jagan;andhra pradesh;vishakapatnam;assembly;minister;tdp;local language;nijam;partyThu, 04 Feb 2021 10:30:00 GMTమంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నను అరెస్టు చేసినప్పుడు ఆయన కొట్టిన ఓ డైలాగ్ ఇప్పుడు సంచలనానికి దారి తీస్తోంది. అచ్చెన్న ఏమన్నారంటే.. నామీద కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తిని కాదు. స్థానిక డీఎస్పీ, సీఐ వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్లీ ఛాలెంజ్‌ చేస్తున్నాను. తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోంమంత్రి పదవి నేనే తీసుకుంటాను. ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నవారంతా ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అచ్చెన్న.

అచ్చెన్నాయుడి డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లో బాగా చర్చనీయాంశం అవుతోంది. దీన్ని అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. అచ్చెన్నాయుడికి హోం మంత్రిపై ఎప్పటి నుంచో కన్ను ఉందని.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత అచ్చెన్న హోంమంత్రి పదవి ఆశించారని కొందరు అంటున్నారు. అప్పుడు నిరాశ దక్కడంతో వేరే పదవితో అచ్చెన్న సరిపట్టుకున్నారని విశ్లేషిస్తున్నారు. అందుకే ఇప్పుడు ముందుగానే తన మనసులో కోరిక బయటపెట్టి చంద్రబాబును లాక్ చేస్తున్నారన్నది కొందరి విశ్లేషణ.

మరోవైపు ఇది చంద్రబాబుకు బ్లాక్ మెయిలింగ్‌ లాంటిదే అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో ఉన్నందున ఒకసారి జైలుకు కూడా వెళ్లి వచ్చానని.. ఇప్పుడు మరోసారి జైలుకు వెళ్తున్నానని.. పార్టీ కోసం ఇంత రిస్కు తీసుకుంటున్న తనకు పార్టీ అధికారంలోకి వస్తే హోంమంత్రి వంటి ప్రాధాన్యం ఉన్న పదవి దక్కాల్సిందేనని ముందుగానే అచ్చెన్నాయుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.

మరోవైపు అచ్చెన్నపై కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు కూడా.. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ కొట్టిన డైలాగ్‌ను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో సవాల్ చేసిన జగన్ ఆ తర్వాత నిజంగానే సీఎం అయ్యారు. మరి అచ్చెన్న కూడా హోంమంత్రి అవుతారా.. ఏమో చెప్పలేం.. ఏమైనా జరగొచ్చు కదా.




జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>