Crimeyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/axe-attacke83fa5b7-7825-44f6-afea-f0b0a32e0c89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/axe-attacke83fa5b7-7825-44f6-afea-f0b0a32e0c89-415x250-IndiaHerald.jpgసూర్యాపేటకు చెందిన రవికుమార్‌ దంపతులు రెండేళ్ల నుంచి గుర్రంగూడలోని టీచర్స్‌ కాలనీలో నివసిస్తున్నారు. రవికుమార్‌ ప్రైవేటు ఉద్యోగి కాగా, భార్య ఇంట్లోనే ఉండేవారు. వారికి అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన సీహెచ్‌ రాహుల్‌గౌడ్‌(25)తో రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాహుల్ గౌడ్ తరచుగా ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే పరిచయం ముసుగులో రవికుమార్ భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. తరచుగా ఇంటికి రావడం.. పరిచయాన్ని..axe attack;rahul new;rahul;hyderabad;k l rahul;police;k s ravikumar;air;wife;woman;rahul sipligunj;local language;gottipati ravi kumar;reddy;nirbayaజైలుకు పంపిందన్న కోపంతో కక్ష.. గొడ్డలితో ఇండిబయటే..జైలుకు పంపిందన్న కోపంతో కక్ష.. గొడ్డలితో ఇండిబయటే..axe attack;rahul new;rahul;hyderabad;k l rahul;police;k s ravikumar;air;wife;woman;rahul sipligunj;local language;gottipati ravi kumar;reddy;nirbayaThu, 04 Feb 2021 10:24:18 GMTహైదరాబాద్: సూర్యాపేటకు చెందిన రవికుమార్‌ దంపతులు రెండేళ్ల నుంచి గుర్రంగూడలోని టీచర్స్‌ కాలనీలో నివసిస్తున్నారు. రవికుమార్‌ ప్రైవేటు ఉద్యోగి కాగా,  భార్య ఇంట్లోనే ఉండేవారు. వారికి అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన సీహెచ్‌ రాహుల్‌గౌడ్‌(25)తో రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాహుల్ గౌడ్ తరచుగా ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే పరిచయం ముసుగులో రవికుమార్ భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. తరచుగా ఇంటికి రావడం.. పరిచయాన్ని ఆసరాగా తీసుకొని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమె తన భర్తకు విషయాన్ని తెలియజేసింది. దీంతో వారిద్దరూ కలిసి ఏడాది క్రితం మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్‌గౌడ్‌పై 354డీ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన రాహుల్ గౌడ్ .. నిన్న సాయంత్రం నేరుగా రవికుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గౌడ్ పరారయ్యాడు.

ఈ కేసుకు సంబంధించి వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలు వెల్లడించారు. మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళపై గొడ్డలితో దాడిచేసిన రాహుల్ గౌడ్ అనే నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారని చెప్పారు. తనపై కేసులు పెట్టి జైలు పాలు చేశారనే కక్షతోనే రాహుల్‌ ఆమెపై ఆగ్రహంతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సదరు మహిళ తన ఇంటి ఎదురుగా నిలబడి పక్కింటి వారితో మాట్లాడుతుండగా.. రాహుల్ గౌడ్ ఆవేశంగా అక్కడకు చేరుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. గొడ్డలి చూడగానే ఆమె లోపలికి పరిగెత్తింది. కానీ అప్పటికే రాహుల్ గౌడ్ ఆమె మెడపై గొడ్డలితో దాడికి ప్రయత్నించాడు. కానీ ఆమె తప్పుకోవడంతో వేటు కుడి భుజం, మోచేతిపై పడింది. దాంతో ఆమెకు తీవ్రగాయాలై విపరీతంగా రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని రాహుల్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా, పారిపోయాడు.

సమాచారం అందుకున్న మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ రెడ్డి తన సిబ్బందితో రంగంలోకి దిగి నిందితుని కోసం గాలించారు. బుధవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలోని నిందితుడి ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు. బాధితురాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిర్భయ కేసులో తనను జైల్లో పెట్టించినందుకే నిందితుడు కక్షపెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. నిందితుడు దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయన్నారు. అతనిపై పీడీయాక్ట్‌ కూడా నమోదు చేస్తామని ఏసీపీ తెలిపారు.


జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>