TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/laptop-charging-carringa02d4bf0-c7cc-4c53-b77b-2354e55de48f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/laptop-charging-carringa02d4bf0-c7cc-4c53-b77b-2354e55de48f-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ప్రజలందరూ ఒక్కసారిగా వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా కారణంగా బయటికి వెళ్ళలేక,ఉద్యోగాలు చేసుకోలేక చాలామంది సతమతమవుతున్నారు. పిల్లలు కూడా కాలేజీకి, స్కూళ్లకు వెళ్లలేక ఆన్లైన్ క్లాసులపై ఆధారపడుతున్నారు. ఇక ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటును ఆయా కంపెనీలు కల్పించాయి. అయితే వీరందరికీ ల్యాప్ టాప్ అతి ముఖ్యమైన పరికరం. ప్రతి ఒక్కరూ ఈ ల్యాప్ టాప్ పైనే తమ పనులను ముగించుకుంటున్నారు. laptop,charging, carring;jeevitha rajaseskhar;airల్యాప్ టాప్ చార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..!ల్యాప్ టాప్ చార్జింగ్ పెడుతున్నారా..? అయితే ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..!laptop,charging, carring;jeevitha rajaseskhar;airWed, 03 Feb 2021 13:00:00 GMTకరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ప్రజలందరూ ఒక్కసారిగా వణికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా  కారణంగా బయటికి వెళ్ళలేక,ఉద్యోగాలు చేసుకోలేక చాలామంది సతమతమవుతున్నారు. పిల్లలు కూడా కాలేజీకి, స్కూళ్లకు వెళ్లలేక ఆన్లైన్ క్లాసులపై ఆధారపడుతున్నారు. ఇక ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లోనే ఉద్యోగం చేసుకునే వెసులుబాటును ఆయా కంపెనీలు కల్పించాయి. అయితే వీరందరికీ ల్యాప్ టాప్  అతి ముఖ్యమైన పరికరం.  ప్రతి ఒక్కరూ  ఈ ల్యాప్ టాప్ పైనే  తమ పనులను ముగించుకుంటున్నారు.


ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న ల్యాప్ టాప్.. దాని బ్యాటరీ చార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం కొన్ని తప్పులు చేస్తే, బ్యాటరీ డామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


వర్క్ చేసేటప్పుడు మనలో చాలామంది ల్యాప్ టాప్ చార్జింగ్ అయిపోతే,దానికి చార్జింగ్ పెట్టి, ఇంట్లో మంచం మీదనో లేదా సోఫా మీదనో వదిలేస్తాం.
 కానీ అది మంచిది కాదు.  కేవలం బెంచ్ మీద కానీ, టేబుల్ మీద కాని పెట్టాలి. ఎందుకంటే మనం ల్యాప్ టాప్ ని  బెడ్ మీద కానీ సోఫా మీద కానీ పెట్టి,చార్జింగ్ పెట్టినప్పుడు అందులో ఉన్న హీట్ బయటకు పోదు. బ్యాటరీ లోనే  ఉండిపోతుంది.తద్వారా బ్యాటరీ మరింత వేడెక్కుతోంది.

బ్యాటరీ అలా నిరంతరాయంగా వేడిగానే ఉండడం వల్ల బ్యాటరీ జీవితకాలం తగ్గిపోయి,త్వరగా ల్యాప్ టాప్  పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ల్యాప్ టాప్  చార్జింగ్ పెట్టేటప్పుడు, అందులో నుంచి వేడి బయటకు వెళ్లే మార్గం ఉండేలా చూసుకోవాలి. ఇక బ్యాటరీ జీవిత కాలం ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రోజుకు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడుతున్నామో, ఎంత వాడుతున్నామో  అనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు వాడే ల్యాప్ టాప్  బ్యాటరీ జీవితకాలం ఎక్కువ రావాలంటే, మరి కొన్ని పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.

బ్యాటరీ చార్జింగ్ ఎప్పుడూ 40 శాతం నుంచి 80 శాతం మధ్య  ఉండేలా చూసుకోవాలి.
చార్జింగ్ పెట్టి అలానే ఉంచినప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా చూసుకోవాలి
ల్యాప్ టాప్  కి గాలి తగిలేలా,చల్లని ప్రదేశాలలో మాత్రమే చార్జింగ్ పెట్టాలి.
చార్జింగ్ పూర్తిగా అయిపోయేవరకు ల్యాప్ టాప్ ను  ఉపయోగించకూడదు.

కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ల్యాప్  టాప్ బ్యాటరీ మరింత కాలం మన్నిక వస్తుంది




రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>