HealthSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid1999838430-2199-46cc-83f3-bdffa52f0582-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా ఈ స్ట్రెయిన్ గురించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ స్ట్రెయిన్ మరోసారి ఉత్పరివర్తనం (మ్యుటేషన్) చెందినట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. స్ట్రెయిన్ కోవిడ్ యాంటీబాడీల రక్షణ నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ‘E484Kతో ఉత్పరివర్తనం చెందిన స్ట్రెయిన్ ప్రస్తుతానికి కొద్ది మందికి మాత్రమే సోకింది. అయితే, ఈ రకం వైరస్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండవచ్చటcorona streyin;health;ravi anchor;school;university;cheque;coronavirusమరో కొత్త రూపు సంతరించుకున్న కరోనా స్ట్రెయిన్... వ్యాక్సిన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చట!మరో కొత్త రూపు సంతరించుకున్న కరోనా స్ట్రెయిన్... వ్యాక్సిన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చట!corona streyin;health;ravi anchor;school;university;cheque;coronavirusWed, 03 Feb 2021 19:05:00 GMTగడిచిన గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను తీవ్రంగా వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఇంకా తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారనే సంగతి తెలిసిందే. అలాగే లక్షల్లో ప్రజలు ఈ మహమ్మారి కారణంగా బలి కావటం జరిగింది. ఇక ఇటీవలే ఈ కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు చెక్ పెట్టేలా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇదే తరుణంలో కరోనా కొత్త లక్షణం సంతరించుకొని 'స్ట్రెయిన్' గా బ్రిటన్ దేశంలో బయటపడ్డ ఈ మహమ్మారి, సాధారణ కరోనా వైరస్‌తో పోల్చితే బ్రిటన్‌లో 40 శాతం వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు నిపుణులు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ స్ట్రెయిన్ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా ఈ స్ట్రెయిన్ గురించి మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ స్ట్రెయిన్ మరోసారి ఉత్పరివర్తనం (మ్యుటేషన్) చెందినట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దక్షిణ ఇంగ్లండ్‌లోని వెలుగుచూసిన ఈ ‘కెంట్‌’ వైరస్‌ నమూనాలపై కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం బయటపడింది. గతంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో గుర్తించిన ‘E484K’ రకం వైరస్‌తో కలిసి కెంట్‌ ఉత్పరివర్తనం చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో సమీక్షించాల్సి ఉంది. మ్యుటేషన్ B.1.1.7 జాతి కనీసం 11 నమూనాలలో కొత్తగా గుర్తించారు. ఈ నమూనాలలో కొన్ని ఒకే కేసు నుంచి వ్యాప్తి చెందకుండా, ఉత్పరివర్తనం స్వతంత్రంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అంతేకాదు, ఈ స్ట్రెయిన్ కోవిడ్ యాంటీబాడీల రక్షణ నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ‘E484Kతో ఉత్పరివర్తనం చెందిన స్ట్రెయిన్ ప్రస్తుతానికి కొద్ది మందికి మాత్రమే సోకింది. అయితే, ఈ రకం వైరస్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండవచ్చని భావిస్తున్నాం.





కరోనా వైరస్‌లో కొత్తగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తదుపరి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. 80 ఏళ్ల వృద్ధులు రెండు డోసుల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను తీసుకుంటేనే వారికి మహమ్మారి నుంచి తగిన రక్షణ లభిస్తుందని కూడా మా పరిశోధనలో తేలింది’ అని కేంబ్రిడ్జ్‌ పరిశోధకుడు ప్రొఫెసర్‌ రవి గుప్తా తెలిపారు. ఇప్పటికే గుర్తించిన వేరియంట్.. టీకాలు అందించే రోగనిరోధక రక్షణకు కొంతమేర నిరోధకత కలిగివుండటం లేదా ఇంతకు ముందు సోకిన వ్యక్తులలో పునర్నిర్మాణానికి కారణమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని దీని అర్ధం అని నిపుణులు వ్యాఖ్యానించారు. టీకా సమర్ధతకు ఇది ఓ రకంగా చేదు వార్తేనని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడిమియాలజీ అసోసియేట్ రిసెర్చ్ సైంటిస్ట్ జోసెఫ్ ఫౌవేర్ అన్నారు. ‘కొత్తగా గుర్తించిన వేరియంట్ గురించి అమెరికాలోనూ పర్యవేక్షణ కొనసాగించాల్సిన అవసరం ఉంది.. ఇక్కడ జన్యు శ్రేణి వైవిధ్యాలను గుర్తించే ప్రయత్నాలు బ్రిటన్ కంటే వెనుకబడి ఉన్నాయి.. దీనిని యూకేలో మాత్రమే గుర్తించామంటే వారి బలమైన జన్యు పర్యవేక్షణ కార్యక్రమం ఫలితం కావచ్చు’అని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 పథాన్ని ప్రభావితం చేస్తున్నా? లేదా అనేది త్వరగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా, కొన్ని పరిశోధనలు దక్షిణాఫ్రికాలో టీకాల ప్రభావం తక్కువగా ఉందన్న వెనుక E484K ఒక ప్రధాన కారణం కావచ్చునని మరికొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.




ఖాతాదారులకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఇన్ని డిస్కౌంట్లా.. వామ్మో!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>