SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smarana68999e70-bf57-4cb5-9ecb-d1486a436ead-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/smarana68999e70-bf57-4cb5-9ecb-d1486a436ead-415x250-IndiaHerald.jpgఆయ‌న పేరుకు త‌గ్గ‌ట్టుగానే సినీ సంగీతంలో ఎదురులేని చ‌క్ర‌వ‌ర్తిలాగే కొన‌సాగారు. అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో కోట్లాదిమంది సినీ అభిమానుల‌ను, శ్రోత‌ల‌ను రంజింప‌జేశారు సంగీత దర్శకులు కె.చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు ఆయ‌న‌. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారsmarana;soundarya;chakravarthy;geetha;nageshwara rao akkineni;prema;rani;simhaa;india;vijayawada;guntur;district;cinema;sangeetha;love;degree;hindi;music;akkineni nageswara rao;chitramపేరుకు త‌గ్గ‌ట్టుగానే సంగీతంలో చ‌క్ర‌వ‌ర్తిగా మిగిలిపోయిన అప్పారావు...పేరుకు త‌గ్గ‌ట్టుగానే సంగీతంలో చ‌క్ర‌వ‌ర్తిగా మిగిలిపోయిన అప్పారావు...smarana;soundarya;chakravarthy;geetha;nageshwara rao akkineni;prema;rani;simhaa;india;vijayawada;guntur;district;cinema;sangeetha;love;degree;hindi;music;akkineni nageswara rao;chitramWed, 03 Feb 2021 07:05:00 GMTసంగీత దర్శకులు కె.చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు ఆయ‌న‌. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్  అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.  ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి.  చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు.


చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అతని తమ్ముడే దర్శకుడిగా రాణించిన కొమ్మినేని శేషగిరిరావు. అప్పారావుది గుంటూరు జిల్లా, పొన్నెకల్లు గ్రామం. అతను తల్లిదండ్రులు సంగీతజ్ఞానం కలవారు. ఆ కారణంగా అతనుకి సంగీతంపై ఆసక్తి కలిగింది. అతని ఉత్సాహంచూసి తండ్రిగారు గుంటూరులో ఉన్న మహావాది వెంకటప్పయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించారు. ఒక పక్క చదువు, మరో పక్క సంగీతాభ్యాసం నిరాటంకంగానే సాగాయి. అతను ఉత్సాహం పట్టలేక వినోద్ ఆర్కెస్ట్రా అనే బృందాన్ని ఏర్పాటు చేసి పాటలు, పద్యాలు పాడుతూ ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో 1954-58ల మధ్య కె.అప్పారావు కంఠం పాటలతో ప్రతిధ్వనించేది. నాటి శ్రోతలకి అతని కంఠం బాగా పరిచయం. 1958లో బి.ఏ.లో డిగ్రీ తీసుకున్నా, హిందీ పరీక్షలో విశారదుడైనా ఉన్న ఉత్సాహం సంగీతాన్ని ఎన్నుకున్నాడు, నమ్ముకున్నాడు కానీ ఉద్యోగ ప్రయత్నం మాత్రం చేయలేదు.


 ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే.  అసలు నటుడు కావాలనే చక్రవర్తి చెన్నపట్టణం చేరారు. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ అన్నట్టు చక్రవర్తికి నటునిగా అవకాశాలేవీ లభించలేదు. దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రీ-రికార్డింగ్ లో పనిచేశారు. పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు. ఫలోమా అనే మలయాళ చిత్రం హిందీ దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు అతనుకు చెప్పి చక్రవర్తిగా వేశారు. మూగ ప్రేమ (1970) చిత్రంకి అతను సంగీత దర్శ్కత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, ఎన్.టి.రామారావు‌తో కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 960తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.చివరిసారిగా నిన్నే ప్రేమిస్తా చిత్రంలో సౌందర్య నాన్నగారిగా నటించారు.




కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>