PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-us36cf6c92-c1ec-4f40-95d1-a599969f4db0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-us36cf6c92-c1ec-4f40-95d1-a599969f4db0-415x250-IndiaHerald.jpgఅమెరికా ఇండియాకు సారీ చెప్పింది.. ఇలా జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేసింది. భవి‌ష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. అసలేమైంది..ఇదంతా అమెరికా ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగింది.. ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీని మనం జాతిపితగా ఎంతో గౌరవించుకుంటాం.. మన జాతిపిత విగ్రహాలు ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. అలాగే అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ పార్క్‌లో భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అయితే దాన్ని కొందరు సమాజ వ్యతిరేకులు ఇటీవల దాన్ని ధindia-us;india;mohandas karamchand gandhi;american samoa;californiaసారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?india-us;india;mohandas karamchand gandhi;american samoa;californiaWed, 03 Feb 2021 07:00:00 GMTఅమెరికా ఇండియాకు సారీ చెప్పింది.. ఇలా జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేసింది. భవి‌ష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. అసలేమైంది..ఇదంతా అమెరికా ఎందుకు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగింది.. ఒకసారి చూద్దాం. మహాత్మా గాంధీని మనం జాతిపితగా ఎంతో గౌరవించుకుంటాం.. మన జాతిపిత విగ్రహాలు ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి.


అలాగే అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ పార్క్‌లో  భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అయితే దాన్ని కొందరు సమాజ వ్యతిరేకులు ఇటీవల దాన్ని ధ్వంసం చేశారు. డేవిస్‌ నగరంలోని సెంట్రల్‌ పార్క్‌లో 294 కిలోల బరువు, ఆరడుగుల పొడవు కలిగిన జాతిపిత భారీ కాంస్య విగ్రహం ఉంది. సరిగ్గా వారం గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. మహాత్ముడి విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఈ ఘటన మీడియాలో ప్రముఖంగా వచ్చింది.


మహాత్మా గాంధీకి జరిగిన ఈ అవమానం పట్ల భారతీయ అమెరికన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాక్రమెంటో వంటి సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. దీంతో ఇష్యూ పెద్దదైంది. చివరకు ఈ దారుణం పట్ల అమెరికా అధ్యక్ష నివాసం వైట్‌ హౌస్‌ కూడా స్పందించింది. ఈ ఘటనపై  విచారం వ్యక్తం చేసింది. మహాత్మా గాంధీ స్మారక కట్టడాలపై ఈ విధమైన దాడులు జరగటం పట్ల మేము ఆందోళన చెందుతున్నామని..  కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని...  ఈ దుర్ఘటనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని... దోషులను గుర్తించి, శిక్షిస్తామని... వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీం తెలిపారు.


అంతే కాదు... డేవిస్‌ నగర మేయర్‌ గ్లోరియా పాట్రిడా  కూడా స్పందించారు. మహాత్మా గాంధీ తమకు ప్రేరణ అని.. ఆయన ప్రతిరూపాన్ని ధ్వంసం చేయటాన్ని ఎప్పటికీ మన్నించబోమని  ఆమె వెల్లడించారు. ఇకపై ఇలాంటి  ఘటనలను ఇకపై పునరావృతం కానీయమని భరోసా ఇచ్చారు. 


కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి ఫెయిల్యూర్ కు కారణాలివేనా ? మరి పవన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>