EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-ycp-assembly-kakani-governor-jagan-naida1f18eaf-ebd1-4cd9-a0f6-4ba01cb98f16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-ycp-assembly-kakani-governor-jagan-naida1f18eaf-ebd1-4cd9-a0f6-4ba01cb98f16-415x250-IndiaHerald.jpgకాకాణి చెప్పింది విన్నతర్వాత నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోవటం ఖాయమని అర్ధమైపోయింది. కాకపోతే యాక్షన్ తీసుకోవటంలో కమిటి మరీ తొందరపడటం లేదు. ఒకటికి రెండుసార్లు ఫిర్యాదుపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుని స్పీకర్ కు సిఫారసు చేయాలని డిసైడ్ చేశారు. సిఫారసు అందగానే స్పీకర్ బహుశా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశంలో మెజారిటి సభ్యుల అభిప్రాయం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందే నిమ్మగడ్డకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. మంత్రులపై గవర్నర్ కు తాను చేసిన ఫిర్యాదుకు సంబంధnimmagadda ycp assembly kakani governor jagan naid;kumaar;vedhika;kakani govardhan reddy;maharashtra - mumbai;botcha satyanarayana;peddireddy ramachandra reddy;media;court;assembly;governor;maharashtra;reddy;mantraహెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డపై యాక్షన్ కు ముహూర్తం రెడీ..పెరిగిపోతున్న టెన్షన్హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డపై యాక్షన్ కు ముహూర్తం రెడీ..పెరిగిపోతున్న టెన్షన్nimmagadda ycp assembly kakani governor jagan naid;kumaar;vedhika;kakani govardhan reddy;maharashtra - mumbai;botcha satyanarayana;peddireddy ramachandra reddy;media;court;assembly;governor;maharashtra;reddy;mantraWed, 03 Feb 2021 03:00:00 GMTస్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద యాక్షన్ కు వేదిక రెడీ అయిపోయింది. నిమ్మగడ్డ మీద ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదును అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి సుదీర్ఘంగా చర్చించింది. స్పీకర్ ఆదేశాల మేరకు సమావేశమైన సభ్యులు నిమ్మగడ్డపై యాక్షన్ కు రెడీ అయిపోయినట్లు సమాచారం. కాకపోతే ఆ విషయాన్ని మీడియా సమావేశంలో కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేరుగా చెప్పలేదంతే. మంత్రుల ఫిర్యాదుపై చర్చించిన కమిటి సభ్యులు నిమ్మగడ్డపై ఫిర్యాదుపై పరిశీలించేందుకు, యాక్షన్ రికమెండ్ చేయటానికి కమిటికి అన్నీ అధికారాలున్నట్లు నిర్ధారించుకున్నారు. కాబట్టి ఇదే విషయమై మరోసారి సమావేశమవ్వాలని సభ్యులు అనుకున్నట్లు కాకాణి చెప్పారు.




కాకాణి చెప్పింది విన్నతర్వాత నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోవటం ఖాయమని అర్ధమైపోయింది. కాకపోతే యాక్షన్ తీసుకోవటంలో కమిటి మరీ తొందరపడటం లేదు. ఒకటికి రెండుసార్లు ఫిర్యాదుపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుని స్పీకర్ కు సిఫారసు చేయాలని డిసైడ్ చేశారు. సిఫారసు అందగానే స్పీకర్ బహుశా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశంలో మెజారిటి సభ్యుల అభిప్రాయం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందే నిమ్మగడ్డకు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. మంత్రులపై గవర్నర్ కు తాను చేసిన ఫిర్యాదుకు సంబంధించి సంజాయిషి కోరుతుంది కమిటి. నిమ్మగడ్డ గనుక సంజాయిషి ఇస్తే ఆ సమాధానంపైన కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తారు.




సరే నిమ్మగడ్డ కమిటి ముందు హాజరవుతారా ? సంజాయిషి ఇస్తారా అన్నది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకునే విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోవటంలో కూడా తొందరపాటు చూపటం లేదు. తాజాగా కాకాణి చెప్పిన ప్రకారమైతే నిమ్మగడ్డ మీద యాక్షన్ తీసుకోవటం తథ్యంమని తేలిపోయింది. అందుకనే గతంలో మహారాష్ట్రలో ఎలక్షన్ కమీషనర్ విషయంలో జరిగిన విషయాన్ని ఉదాహరణగా చెప్పారు. అంటే అప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను స్పీకర్ ఆదేశాల ప్రకారం రెండు రోజులు జైలుకు పంపారట. తర్వాత ఇదే విషయమై కమీషనర్ కోర్టులో కేసు వేసినా దాన్ని హైకోర్టు కొట్టేసిందట. కాకాణి చెప్పిన ఈ ఒక్క ఉదాహరణ చాలు నిమ్మగడ్డ మీద యాక్షన్ కు వేదిక రెడీ అయిపోయిందని అనుకోవటానికి. కాకపోతే ఎప్పుడనేదే సస్పెన్స్.




పేటలో రజిని సెట్ చేసేసుకున్నట్లేనా? మళ్ళీ అదే రిపీట్ అవుతుందా?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>