MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-aadipurushf34eccc8-bede-48d7-bbc7-a2deff1f02f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-aadipurushf34eccc8-bede-48d7-bbc7-a2deff1f02f6-415x250-IndiaHerald.jpgప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రీకరణ ముంబైలో మంగళవారం రోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది. అయితే సరిగ్గా సాయంత్రం 4 గంటల 15 నిమిషాల సమయంలో మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. prabhas aadipurush;prabhas;krishna;adinarayanareddy;cinema;marriage;februaryప్రభాస్ షూటింగ్ లో ప్రమాదానికి కారణం అదే అంటూ తేల్చేసిన అధికారులుప్రభాస్ షూటింగ్ లో ప్రమాదానికి కారణం అదే అంటూ తేల్చేసిన అధికారులుprabhas aadipurush;prabhas;krishna;adinarayanareddy;cinema;marriage;februaryWed, 03 Feb 2021 18:16:51 GMTప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ చిత్రీకరణ ముంబైలో మంగళవారం రోజు లాంఛనంగా ప్రారంభమయ్యింది. అయితే సరిగ్గా సాయంత్రం 4 గంటల 15 నిమిషాల సమయంలో మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో చిత్రబృందం మొత్తం అప్రమత్తమైంది. వందల కోట్లతో రూపొందించబోతున్న ఆదిపురుష్ మూవీ యొక్క షూటింగ్ ఫస్ట్ రోజే భారీ అగ్ని ప్రమాదం జరగడంతో చెడు శకునం ఎదురయ్యిందని దర్శక నిర్మాతలు భయపడి పోతున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం మంచి ముహూర్తం లో సినిమా చిత్రీకరణ ప్రారంభించక పోవడమే నని పండితులు చెబుతున్నారు.

ముహూర్త బలం పుష్య బహుళ పంచమి రోజున ఎలాంటి ముహూర్తాలు లేవని.. కానీ అలాంటి రోజున ఆదిపురుష్ మూవీ షూటింగ్ ప్రారంభించడంతో.. అగ్ని ప్రమాదం రూపం లో అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయని కొంత మంది పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం గురుమూఢమి ఉంది కాబట్టి ఎవరు కూడా శుభ కార్యాలు చేసుకోరు. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు జరపాలి అనుకున్నా అనేకమైన అవాంతరాలు ఎదురవుతాయి. అయితే ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు శుక్రమూఢమి ఉంది. అప్పటి వరకు పెళ్లి చేయడం, గృహ ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడం, పుణ్య కార్యక్రమాలు చేయడం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పండితులు చెబుతుంటారు.

ఐతే మూఢమిలు అయిపోయేంత వరకు శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. సినిమా ప్రాజెక్టుల విషయంలో కూడా హీరోలు, దర్శకనిర్మాతలు మంచి ముహూర్తం చూసుకొని కార్యక్రమాలను మొదలుపెడతారు. కానీ ఆది పురుష్ చిత్ర బృందం శుభ ముహూర్తాలు చూసుకోకుండా సినిమా ప్రారంభించిందని అందుకే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని పండితులు చెబుతున్నారు. కృష్ణంరాజు కూడా మంచి ముహూర్తం చూసి సినిమా ప్రారంభించాలని ప్రభాస్ కి మరియు చిత్ర బృందానికి సూచించినట్టు తెలుస్తోంది.


సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>