ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kannababu-raju6f6d017c-0602-42f3-bc84-c6d77ce17bff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/kannababu-raju6f6d017c-0602-42f3-bc84-c6d77ce17bff-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు గారు చేసిన ‘పంచాయితీ’ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసిన ఒక అభ్యర్థి అల్లుడిని కన్నబాబు రాజు ఫోన్లో బెదిరించిన సంఘటన విశాఖ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.kannababu raju;kumaar;hari;hari music;santhosh;vijay;telugu desam party;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;district;smart phone;vishakapatnam;police;kurasala kannababu;panchayati;twitter;mla;audio;tdp;joseph vijay;ycp;janasena party;yelamanchili;research and analysis wing;santhossh jagarlapudi;partyజగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...kannababu raju;kumaar;hari;hari music;santhosh;vijay;telugu desam party;atchannaidu kinjarapu;andhra pradesh;janasena;y. s. rajasekhara reddy;congress;ram madhav;district;smart phone;vishakapatnam;police;kurasala kannababu;panchayati;twitter;mla;audio;tdp;joseph vijay;ycp;janasena party;yelamanchili;research and analysis wing;santhossh jagarlapudi;partyWed, 03 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు గారు చేసిన ‘పంచాయితీ’ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసిన ఒక అభ్యర్థి అల్లుడిని కన్నబాబు రాజు ఫోన్లో బెదిరించిన సంఘటన విశాఖ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాంబిల్లి మండలం లాలంకోడూరు పంచాయతీ శివారు సీతాపాలెం గ్రామానికి చెందిన లాలం సంతోష్ సొంత మామ లాలంకోడూరు పంచాయతీ వార్డు సభ్యుడిగా, వైసీపీ రెబల్‌గా నామినేషన్ వేశాడు.



అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కన్నబాబు కలగజేసుకుని నామినేషన్ విత్‌డ్రా చేయించాలంటూ బుధవారం ఫోన్‌లో సంతోష్‌పై బెదిరింపులకు దిగారు. అయితే ఈ సంభాషణను రికార్డు చేసిన బాధితుడు రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నామినేషన్ విత్‌డ్రా చేయించకపోతే జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆడియో రికార్డును కూడా పోలీసులకు అందజేశారు. దీంతో బాధితుడికి మద్దతుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్ కుమార్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, నామినేషన్ వేసిన అభ్యర్థికి ఫోన్ చేసి బెదిరించారనే ఆరోపణలతో ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కన్నబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియో టేప్‌ను తెలుగు దేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అలాగే ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘‘పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ భూస్వామ్య, పెత్తందారీ పోకడలు బుసలు కొడుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు (వైసీపీ) పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి ఉపసంహరించుకోకపోతే మీరు (మీ మామ) జైలుకు పోతారంటూ, నీకు రావలసిన డబ్బులు రావంటూ అభ్యర్థి అల్లుడిని బెదిరిస్తున్నారు? వీళ్లా రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు కాపాడేది? వీళ్లా ప్రజాభ్యున్నతికి పాటు పడేది? బంధువును రిక్వెస్ట్ చేసిన అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి, బెదిరించిన కన్నబాబుపై అసలు కేసులు పెట్టకపోవడం పోలీసుల దుర్మార్గానికి, బానిసత్వానికి నిదర్శనం.’’ అంటూ టీడీపీ ఈ వ్యవహార విషయమై తీవ్రంగా స్పందించింది.


" style="height: 506px;">




చిలగడదుంప చేసే మేలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు...!

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>