MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megsatar-chiranjeevi-may-month-sentiment70cbee0d-6870-48f3-ad9e-86bcaa9bf9c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megsatar-chiranjeevi-may-month-sentiment70cbee0d-6870-48f3-ad9e-86bcaa9bf9c9-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చీరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయనున్నారుchiranjeevi;chiranjeevi;nageshwara rao akkineni;rohini;cinema;jaan;blockbuster hit;hero;khaidi.;ramzan;gang leader;lie;john;leader;khaidi newమే నెలకి చిరంజీవి కి ఉన్న సెంటిమెంట్ గురించి మీకు తెలుసా..28 ఏళ్ళ తర్వాత మల్లి అలా..?మే నెలకి చిరంజీవి కి ఉన్న సెంటిమెంట్ గురించి మీకు తెలుసా..28 ఏళ్ళ తర్వాత మల్లి అలా..?chiranjeevi;chiranjeevi;nageshwara rao akkineni;rohini;cinema;jaan;blockbuster hit;hero;khaidi.;ramzan;gang leader;lie;john;leader;khaidi newWed, 03 Feb 2021 16:49:04 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చీరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయనున్నారు. అయితే మెగాస్టార్ కి మే నెలకి చాల మంచి సంబందం ఉంది. అది ఏంటో చూద్దామా.

అయితే మే నెల గతంలో చిరంజీవికి బాగా కలిసి వస్తుందట. చిరంజీవి కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలా అని అన్నీ సూపర్ హిట్లే కాదు.. మే నెలలో విడుదలైన చిరంజీవి సినిమాల్లో ఫ్లాపులు ఉన్నాయి. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక చిరంజీవి 86వ చిత్రం ‘వేట’ 1986 మే 28న విడుదలైంది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ 1990 మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘వేట’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి మధ్య 22 సినిమాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా మే నెలలో విడుదల కాలేదు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన తరవాత సంవత్సరమే అంటే 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదో ట్రెండ్ సెట్టర్.

అంతేకాదు ‘గ్యాంగ్ లీడర్’ తరవాత మళ్లీ మే నెలలో విడుదలైన సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తరవాత చిరంజీవి మరో సినిమా మే నెలలో రాలేదు. ఇప్పుడు సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆచార్య’ రూపంలో చిరంజీవి సినిమా మే నెలలో వస్తోంది. మే 13 గురువారం వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ కూడా గురువారం నాడే విడులైందట. అంతేకాదు, మే 13న రోహిణి నక్షత్రమట. చాలా మంచిదట. ఇవన్నీ ‘ఆచార్య’కు కలిసొస్తాయని చర్చ. వీటికి తోడు మే 13న రంజాన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇవన్నీ కలిస్తే ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>