Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dog-based-on-twin-bomb-blasts580240bf-28ba-4ac6-bd7d-9b5f19a2ad62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-wild-dog-based-on-twin-bomb-blasts580240bf-28ba-4ac6-bd7d-9b5f19a2ad62-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోలంతా ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం సీనియర్ హీరోలే కాదు యంగ్ హీరోస్ సైతం వేరే హీరోలతో కలిసి నటించేందుకు సై అంటున్నారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న చాల సినిమాలు అలాంటి మల్టీస్టారర్ కాంబినేషన్లతోనే తెరకెక్కుతున్నాయి.రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కలయికలో ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్.. రానా ల కలయికలో ఓ మూవీ, చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో ఆచార్య మూవీస్ సెట్స్ ఫై ఉన్నాయి.nagarjuna-ram;beauty;pawan;chiranjeevi;ntr;rana;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;naga;naga shourya;ram pothineni;ramya krishnan;rrr movie;cinema;naga aswin;king;director;hero;king 1;success;nandamuri taraka rama rao;chaitanya 1నాగార్జున ప్లాన్ అదిరిందిగా..!నాగార్జున ప్లాన్ అదిరిందిగా..!nagarjuna-ram;beauty;pawan;chiranjeevi;ntr;rana;ram charan teja;naga chaitanya;nagarjuna akkineni;kalyan;kalyan krishna;krishna;naga;naga shourya;ram pothineni;ramya krishnan;rrr movie;cinema;naga aswin;king;director;hero;king 1;success;nandamuri taraka rama rao;chaitanya 1Wed, 03 Feb 2021 21:55:00 GMTఎన్టీఆర్ ల కలయికలో ఆర్ఆర్ఆర్, పవన్ కళ్యాణ్.. రానా ల కలయికలో ఓ మూవీ, చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో ఆచార్య మూవీస్ సెట్స్ ఫై ఉన్నాయి. తాజాగా కింగ్ నాగార్జున సైతం ఓ యంగ్ హీరోతో కలిసి సినిమా చేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.

రీసెంట్ గా వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగార్జున..త్వరలో సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. డ్యూయల్ లో రోల్ లో నాగార్జున చించేసాడు. సీనియర్ నటి రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి లతో రొమాన్స్ చేసి నవ మన్మధుడు అనిపించుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ తర్వాత దీనికి సీక్వెల్ గా బంగార్రాజు చేయాలనీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ అనుకున్నాడు. కానీ ఆ కథ ఆలా నడుస్తూ వస్తుంది.

ఇక సెట్స్ పైకి వెళ్లబోతుందంటూ కొంతకాలంగా చెపుతున్నారే తప్ప సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. ప్రస్తుతం మాత్రం అన్ని సెట్ చేశారట. అయితే ఈ సీక్వెల్ లో ఓ కీలక రోల్ కోసం నాగ చైతన్య ను ఎంపిక చేశారట. కానీ ప్రస్తుతం చైతు వరుస సినిమాలతో చాల బిజీ గా ఉన్నాడు. ఇన్ని రోజులు కూడా చైతు కోసమే ఎదురుచూశారట. కానీ ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్థితి లో చైతు లేకపోవడం తో ఆ రోల్ లో మరో యంగ్ హీరోను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఆ రోల్ కోసం హీరో రామ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. రామ్ అయితే ఈ కథ కు కరెక్ట్ గా సరిపోతాడని భావిస్తున్నారట. త్వరలోనే ఆయనకు కథ వినిపించాలని డైరెక్టర్ అనుకుంటున్నాడు. ఒకవేళ రామ్ నో చెపితే సెకండ్ ఆప్షన్ గా నాగ శౌర్య ను అనుకుంటున్నారు. చూడాలి నాగ్ తో ఎవరు నటిస్తారో..




అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>