PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan-elections30a1a20b-18db-45c7-b24b-ce1d097d81d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan-elections30a1a20b-18db-45c7-b24b-ce1d097d81d3-415x250-IndiaHerald.jpgఎందుకో గానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధం చేసి రిలీజ్ చేసిన ఈ వాచ్ యాప్ అంటే వైసిపి భయపడుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ లాంచ్ చేశారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ వాచ్ యాప్ రూపకల్పన చేశామని ఆయన చెబుతున్నారు. ఈ యాప్ తో నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు అలాగే ఎవరైనా ప్రలోభాలు లాంటివి పెడితే ఆ సంగతులన్నీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఆయన చెnimmagadda jagan elections;watch;kumaar;andhra pradesh;high court;panchayati;letter;tdp;central government;ycp;officeజగడ్డ : ఆ యాప్ అంటే వణుకుతున్న వైసీపీ...అందుకేనా ?జగడ్డ : ఆ యాప్ అంటే వణుకుతున్న వైసీపీ...అందుకేనా ?nimmagadda jagan elections;watch;kumaar;andhra pradesh;high court;panchayati;letter;tdp;central government;ycp;officeWed, 03 Feb 2021 14:00:00 GMTఎందుకో గానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధం చేసి రిలీజ్ చేసిన ఈ వాచ్ యాప్ అంటే వైసిపి భయపడుతోంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాచ్ యాప్ లాంచ్ చేశారు. పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఈ వాచ్ యాప్ రూపకల్పన చేశామని ఆయన చెబుతున్నారు. ఈ యాప్ తో నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని ఆయన చెబుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు అలాగే ఎవరైనా ప్రలోభాలు లాంటివి పెడితే ఆ సంగతులన్నీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసి దాంతో యాప్ ని అనుసంధానం చేస్తామని ఆయన చెబుతున్నాడు. 

అయితే ఈ యాప్ మీద ఇప్పటికే వైయస్సార్ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ యాప్ వాడకూడదని అది సొంతంగా తయారు చేసిన యాప్ కావడంతో నిలిపివేయాలని లంచ్ మోషన్ పిటిషన్లో కోరారు. అయితే లంచ్ మోషన్ నిరాకరించిన హైకోర్టు రేపు విచారణ జరుపుతామని చెప్పుకొచ్చింది. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ యాప్ అంటే అంత టెన్షన్ పడుతోంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఈ యాప్ టిడిపి ఆఫీస్ లో తయారయింది అనే ఆరోపణలు సైతం కొందరు వైసీపీ నేతలు చేస్తున్నారు. ఎలా అయితే గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి తనకు రక్షణ కల్పించాలని రాసిన లేఖ టిడిపి ఆఫీస్ లో తయారయింది  అని ప్రచారం చేశారో అలాగే ఈ యాప్ కూడా టీడీపీ ఆఫీసులో తయారైందని వాదన వినిపిస్తున్నారు వైసీపీ శ్రేణులు. 

ముందు టిడిపి ఆఫీస్ లో తయారు చేశారని విమర్శించారు. ఆ తరువాత ఈ యాప్ కంట్రోల్ అంత టిడిపి వాళ్ల చేతుల్లో ఉంటుందని అంటున్నారు. అదీగాక ఈ యాప్ లో ఫిర్యాదు కేవలం టిడిపి వాళ్ళు మాత్రమే చేయగలరు అని వేరే పార్టీల వాళ్ళు చేయలేరని ఇలా రకరకాల ప్రచారాలు ఈ యాప్ కు సంబంధించి పుట్టిస్తున్నారు వైసీపీ శ్రేణులు. కేవలం ఫిర్యాదుల స్వీకరణ కోసమే ఈ యాప్ లాంచ్ చేశామని ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. అంటే దీనికి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం అయితే లేదు. మరి వైసిపి ఎంత కంగారు ఎందుకు పడుతుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఈ యాప్ ద్వారా ఎవరైనా ప్రవేశపెడితే ఆ ప్రలోభాలకు సంబంధించిన వీడియోలు కూడా తీసి పంపించండి అని ఎన్నికల సంఘం కోరడమే వైసీపీ టెన్షన్ కి కారణం అని చెబుతున్నారు. 

ఎందుకంటే వైసీపీ ఏరికోరి తెచ్చుకున్న కొత్త చట్టం ప్రకారం ఈ ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడినా, అక్రమాలకు పాల్పడినా జైలు శిక్షతో పాటు ఎన్నికైన పదవి కూడా రద్దు అవుతుంది. ఒక వేళ ప్రస్తుతానికి ప్రలోభాలకు పాల్పడినట్లు తేలినా సరే ఎన్నికల సంఘం కేవలం చర్యలు తీసుకోమని ఆదేశిస్తుంది. తమ మద్దతుదారుల మీద వైసిపి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు ! అయినా సరే వారి పదవీకాలం ఐదేళ్ల పాటు ఉంటుందని అనుకుందాం. ఈ ఐదేళ్లలో జమిలి ఎన్నికలు రావచ్చు ! ఆ ఎన్నికలలో మరో ప్రభుత్వం ఏర్పాటు కాదు అని కూడా చెప్పలేము ! అప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇలా అక్రమాలకి కారణం అయిన వారి పదవి రద్దు చేసి జైలుకు పంపించినా ఆశ్చర్యం లేదు. ఈ టెన్షన్ అంతా ఎందుకు ? అసలు యాప్ లేకుండా చేస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉండదు కదా అనే ఆలోచనతోనే వైసిపి ఈ యాప్ వద్దనే వాదన గట్టిగా వినిపిస్తోంది అని అంటున్నారు. మరి రేపు పిటిషన్ మీ ద హైకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.




ఆచూకీ చెబితే లక్ష.. ఢిల్లీ పోలీసుల బంపర్ ఆఫర్.. ఇంతకీ ఎవరి గురించంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>