PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ts-prcd77d15b2-336a-4d42-adb4-8f6f6ef298a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ts-prcd77d15b2-336a-4d42-adb4-8f6f6ef298a5-415x250-IndiaHerald.jpgఈసారి కూడా వరుస ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత సాగర్ లేదా కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో పీఆర్సీ ఇప్పట్లో ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదని ఉద్యోగ సంఘాల్లోనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లనే సాకుగా చూపి ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యం చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ts prc;koti;kcr;vedhika;telangana;rtc;january;cm;chief minister;strike;february;letter;success;jacపీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా!పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా!ts prc;koti;kcr;vedhika;telangana;rtc;january;cm;chief minister;strike;february;letter;success;jacWed, 03 Feb 2021 08:54:15 GMTతెలంగాణ ఉద్యోగులకు వేతన సవరణ ఎప్పుడు? అసలు ప్రకటిస్తారా లేదా?  పీఆర్సీ ప్రకటన కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు. జనవరి చివరి వారంలోనే పీఆర్సీ కమిటి నివేదిక ప్రభుత్వానికి చేరింది. బిశ్వాల్ కమిటి కేవలం 7.5 శాతం పిట్మెంటే ఇవ్వాలని సిఫారస్ చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్.. గౌరవప్రధానంగానే ఇస్తారనే నమ్మకంతో ఉన్నాయి తెలంగాణ ఉద్యోగ సంఘాలు. ఫిబ్రవరి తొలి వారంలోనే సీఎం తమకు కానుక ఇస్తారని భావించారు. కాని ఇప్పుడా సూచనలు కనిపించడం లేదు. వేతన సవరణ ఇప్పట్లో తేలేలా లేదని తెలుస్తోంది.

        పీఆర్సీపై ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ  చర్చలు జరుపుతోంది. సంఘాలన్నింటితోనూ మాట్లాడిన తర్వాత నివేదికను మళ్లీ సీఎంకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఫిట్మెంట్పై మరోసారి సీఎం స్థాయిలో సమావేశమైన ప్రకటన చేసే విధంగా షెడ్యూల్ ఉంది. ఈ లెక్కన  పీఆర్సీ అంశం నెలల తరబడి వాయిదా వేయాల్సిందే.

పీఆర్సీ నివేదికపై సీఎస్ ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగులతో  గత నెల 27 నుంచి చర్చలు మొదలుపెట్టింది. తొలి రోజున మూడు, మరునాడు 8, ఆ తర్వాత ఐదారు సంఘాలతో చర్చలు జరిపారు. అందరిదీ ఫిట్మెంట్ పెంపు డిమాండే. ఇదే ప్రభుత్వానికి అవకాశంగా మారింది.
ఎలాగైనా ఫిట్మెంట్పై చర్చలు ఆలస్యమవుతున్నాయనే కారణంతో ప్రభుత్వ డైరెక్షన్లో త్రిసభ్య కమిటీ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలన్నింటితోనూ చర్చలు సాగిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన దాదాపు 150కిపైగా ఉద్యోగ సంఘాలున్నాయి. ఉద్యోగ జేఏసీలోనే 126 సంఘాలున్నాయి. ప్రస్తుతం జేఏసీగా కాకుండా అన్ని సంఘాలతో చర్చలు జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా సంఘాలు తమ వాయిస్ను వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. జేఏసీ కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య వేదిక, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపుగా 150 ఉద్యోగ సంఘాలు ఇప్పుడున్నాయి.  


ఈసారి కూడా వరుస ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ తర్వాత సాగర్ లేదా కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దీంతో పీఆర్సీ ఇప్పట్లో ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదని  ఉద్యోగ సంఘాల్లోనే చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లనే సాకుగా చూపి ఫిట్మెంట్ నిర్ణయం ఆలస్యం చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.  

ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం యూనియన్లు లేకుండా చేయడంలో సక్సెస్ అయింది. సమ్మెకు దిగిన కార్మికులతోనే యూనియన్ల లీడర్లపై విమర్శలు చేసే విధంగా చేసిన ప్లాన్ విజయవంతం అయింది. ఇదే తరహాలో ఇప్పుడు పీఆర్సీపై సంఘాలను బద్నాం చేసే ప్రక్రియ మొదలైందని ప్రచారం జరుగుతున్నది. 


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>