LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/black-eyed-beanse31b55e4-ca86-4407-874b-d5be250ec863-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/black-eyed-beanse31b55e4-ca86-4407-874b-d5be250ec863-415x250-IndiaHerald.jpgఅలసందలు.. ధాన్యాలలో ఒకటి. వీటిలో తక్కువ క్యాలరీలు,తక్కువ కొవ్వు ఉన్న కారణంగా డైట్ లో ఉన్న వాళ్ళు వీటిని తీసుకోవడం మంచిది. అధిక బరువుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీకు పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది. అదనపు ఆహారం జోలికి వెళ్లరు.. షుగర్ వ్యాది తో బాధపడేవారు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. black eyed beans;vitamin;heart;sugar;antioxidant;cholesterol;oxygenఅలసందలు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?అలసందలు తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుతుందా?black eyed beans;vitamin;heart;sugar;antioxidant;cholesterol;oxygenWed, 03 Feb 2021 19:00:00 GMTషుగర్ వ్యాది తో బాధపడేవారు లో-గ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. 


ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే కొన్ని రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తుంది. ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడమే కాకుండా, హార్ట్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. 


వీటిలో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్, పొటాషియం , మెగ్నిషియం గుండె ఆరోగ్యానికి మంచిది. అలసందల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ వలన చర్మానికి హాని కలగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.. వారానికి రెండు సార్లు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది..వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కూడా వీటిని తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేయొచ్చు..ఇకపోతే మొలకలు కట్టుకొని రోజు ఉదయం తీసుకున్నా మంచిదే..కొందరు వీటితో కొత్త ఆహారపదార్థాలను చేసుకొని తింటారు.చూసారుగా వీటి వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో.. మీరు కూడా తినడం మొదలు పెట్టండి..





టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!

టీచర్ల వెతలు : బళ్ళు తెరుచుకున్న..మారని గురువుల బతుకులు ..!!

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>