PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4377abab-63be-4c49-841e-bafa902069d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4377abab-63be-4c49-841e-bafa902069d7-415x250-IndiaHerald.jpgఇందుకు స్పందించిన కొడాలి నాని టిడిపి నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని... రాజకీయ లబ్ది కొరకు తమపై తామే దాడులు జరుపుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ... ఈ నాటకాలు ఆడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండబోదని, ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు కొడాలి నాని.jagan-nimmagadda-elections;nani;kodali nani;prasad;raghu;telugu desam party;jagan;andhra pradesh;hosta;devineni avinash;telugu;police;car;february;minister;fire;tdp;ycp;research and analysis wing;party;bonda umamaheswara rao;mantraజగడ్డ: పట్టాభిపై దాడి వెనుక మంత్రి హస్తంపై...?జగడ్డ: పట్టాభిపై దాడి వెనుక మంత్రి హస్తంపై...?jagan-nimmagadda-elections;nani;kodali nani;prasad;raghu;telugu desam party;jagan;andhra pradesh;hosta;devineni avinash;telugu;police;car;february;minister;fire;tdp;ycp;research and analysis wing;party;bonda umamaheswara rao;mantraWed, 03 Feb 2021 09:00:00 GMTఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడిపై జరిగిన దాడి అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఏపీ పాలిటిక్స్ లో దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ  అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభిపై, విజయవాడలో దుండుగుల దాడి చేసిన విషయం ప్రస్తుతం రాజకీయాల్లో అలజడులు సృష్టిస్తోంది. నిన్న (ఫిబ్రవరి 2) ఉదయం విజయవాడలో కొందరు దుండగులు పట్టాభిపై దాడికి దిగారు. కారణం తెలియదు కానీ ప్రముఖ రాజకీయవేత్త పట్టాభి ప్రయాణిస్తున్న కారును చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు ఘాతకులు.

ఈ ఘటనలో దుండగులు పట్టాభి కారును పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే పట్టాభి మాత్రం స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న టిడిపి నేతలు హుటాహుటిన పట్టాభి నివాసం వద్దకు చేరుకొని పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది ఖచ్చితంగా ఏపీ అధికార పార్టీ నేతలే అంటూ ఆరోపణలు చేశారు. వైసీపీకి  వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు, ముంత్రులే ఈ దాడి చేయించారని గతంలో ఓ సారి దాడి జరిగినా పోలీసులు  ఇసుమంతయినా పట్టించుకోలేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఇలా తమపై దాడులకు దిగుతున్నారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు. పట్టాభిని పరామర్శించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్.. తన బూతుల మంత్రులతో పట్టాభిపై దాడి చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నించిన వారందరినీ చంపేస్తారా..? అయితే నన్ను కూడా చంపేయండంటూ అధికార పార్టీ పై నిప్పులు చెరిగారు. ఓ రకంగా మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు.

ఇందుకు స్పందించిన కొడాలి నాని టిడిపి నేతలపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని... రాజకీయ లబ్ది కొరకు తమపై తామే దాడులు జరుపుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ... ఈ నాటకాలు ఆడటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండబోదని, ప్రజలు అంత అమాయకులు కాదని వ్యాఖ్యానించారు కొడాలి నాని. మరో వైపు పట్టాభిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడె ప్రసాద్ ను పోలీసులు  అడ్డుకునే ప్రయత్నం చేయగా, వీరి మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది..!


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>