Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf3402002-b1c0-40e5-8fe0-82b8632e44c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanf3402002-b1c0-40e5-8fe0-82b8632e44c4-415x250-IndiaHerald.jpgడాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మహేశ్ కోసం తయారుచేసిన కథ `జనగనమణ`. మహేశ్ ఫోటోతో ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఈ కథపై మహేశ్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ యశ్‌తో..pawan kalyan;pawan;mahesh;harish shankar;pawan kalyan;puri jagannadh;shankar;cinema;industry;director;success;kgf;marchపీజే జనగణమన.. ఆ మార్పులు చెప్పిన పవన్..!పీజే జనగణమన.. ఆ మార్పులు చెప్పిన పవన్..!pawan kalyan;pawan;mahesh;harish shankar;pawan kalyan;puri jagannadh;shankar;cinema;industry;director;success;kgf;marchWed, 03 Feb 2021 10:01:13 GMTఇంటర్నెట్ డెస్క్: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మహేశ్ కోసం తయారుచేసిన కథ `జనగనమణ`. మహేశ్ ఫోటోతో ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ ఈ కథపై మహేశ్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ యశ్‌తో ఈ సినిమా చేసేందుకూ సన్నాహాలు చేశాడు పూరిజగన్నాథ్. కానీ అదీ సక్సెస్ కాలేదు. దీంతో ఈ సినిమా స్టోరీ అటకెక్కింది. అయితే ఈ కథపై ఎంతో నమ్మకమున్న పూరి దీనిని పవన్ దగ్గరకు తీసుకెళ్లారట.

కథ విన్న పవన్ కల్యాణ్ కూడా పాజిటివ్‌గా ఉండడంతో ఇప్పుడు పవన్‌తో ఈ కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే స్క్రిప్టు విషయమై పవన్, పూరీ రెండు సార్లు సమావేశం అయినట్టు కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందు ఓ సందేశాత్మక చిత్రం చేయాలని పవన్ అనుకుంటున్నారు. అందువల్ల `జనగనమణ` కథను వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా మార్చి, పవర్‌ఫుల్ డైలాగులు జోడించి చేస్తే బాగుంటుందనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. పూరీ కూడా అదే ఆలోచనతో ఉన్నారట. అంతేకాదు ఎలక్షన్ లోపు వీలైనన్ని సినిమాలు చేయాలని పవర్‌స్టార్ భావిస్తున్నారు.

పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే `వకీల్‌సాబ్` పూర్తి చేసిన పవన్ ప్రస్తుతం `అయ్యప్పన్ కోషియుమ్` రీమేక్‌తో పాటు, క్రిష్‌తో తన కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. వీటి తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతోనూ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి వచ్చే ఏడాది వేసవి వరకు సమయం పడుతుంది. అంటే ఆ తరువాత పూరీతో ‘జనగనమన’ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ లోపు పవన్, పూరి కలిసి ఈ కథకు కొన్ని, మార్పులూ చేసి.. నెక్స్ట్ ఎలక్షన్‌కు ముందు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి రాజకీయ కోణంలో సాగే ఈ కథ.. పవన్ సినీ కెరీర్‌కే కాకుండా పొలిటికల్ కెరీర్‌కు కూడా ఏ మేర బూస్ట్ ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.




నన్నేమీ అడక్కుండానే నాపై సినిమా..ఆ సినిమాలోలా నేనస్సలు చేయలేదు..షకీలా సంచలన వ్యాఖ్యలు..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>