Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chilagada-dumpae22bbc0e-74a5-46b0-9042-e381eab7cdff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chilagada-dumpae22bbc0e-74a5-46b0-9042-e381eab7cdff-415x250-IndiaHerald.jpgచిలగడదుంపలు వీటిని ఇంగ్లీషులో స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఇవి రూట్ వెజిటేబుల్ చాలా పోషక విలువలతో కూడిన ఈ దుంపలు చిన్నపిల్లలు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడ దుంపలను ఉడికించుకొని లేదా కాల్చుకొని తింటే చాలా మధురంగా ఉంటాయి. చిలగడదుంపలు రుచితో పాటు మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు మెండుగా ఉన్నాయి. చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. chilagada dumpa;madhura sridhar reddy;vitamin c;vitamin;heart;sweet potato;aqua;cholesterol;ishtamచిలగడ దుంపలను ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!!చిలగడ దుంపలను ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా!!chilagada dumpa;madhura sridhar reddy;vitamin c;vitamin;heart;sweet potato;aqua;cholesterol;ishtamWed, 03 Feb 2021 03:00:00 GMTస్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు. ఇవి రూట్ వెజిటేబుల్  చాలా పోషక విలువలతో కూడిన ఈ దుంపలు చిన్నపిల్లలు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చిలగడ దుంపలను ఉడికించుకొని లేదా కాల్చుకొని తింటే చాలా మధురంగా ఉంటాయి. చిలగడదుంపలు రుచితో పాటు మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు మెండుగా ఉన్నాయి. చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.       

చిలగడదుంపలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధకశక్తి పెంపొందుతుంది తద్వారా ప్రమాదకర ఫ్లూ, జలుబు వంటి వ్యాధులను దూరంగా ఉంచవచ్చు.

చిలగడ దుంప లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.

చిలకడదుంప లో ఉండే  కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్ మన శరీరంలో ఏ విటమిన్ ప్రేరేపిస్తాయి. తద్వారా కంటి చూపు సమృద్ధిగా ఉండి, కంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

చిలగడదుంపలు మన శరీరానికి అవసరమైన  యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందిస్తాయి. కావున కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది.

చిలగడదుంప లో ఉండి పిండి పదార్థం మనకు తక్షణ శక్తిని అందిస్తుంది. అందువల్లే క్రీడాకారులు వీటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోమని చెబుతుంటారు.
 
చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

విటమిన్ D అధికంగా ఉండడం వల్ల చిలగడ దుంపలు ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు చిలగడదుంప ఔషధం వంటిది. తక్కువ మోతాదులో గ్లైకమిక్స్ ఇండెక్స్ కలిగే ఉండే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.


పేటలో రజిని సెట్ చేసేసుకున్నట్లేనా? మళ్ళీ అదే రిపీట్ అవుతుందా?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>