MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/megastar-dupe0b1e5a87-7f6e-48e8-a075-702113339d48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/megastar-dupe0b1e5a87-7f6e-48e8-a075-702113339d48-415x250-IndiaHerald.jpgఅద్భుతమైన నటనా చాతుర్యంతో తమ అభిమానులను ఎంతగానో అలరించే స్టార్ హీరోలు కొన్ని సార్లు రిస్కీ సన్నివేశాల్లో నటించడానికి సాహసించరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఏదో ఒక రిస్కీ సన్నివేశం నుంచి తప్పక పోవడం సహజం.megastar dupe;chiranjeevi;kumaar;sridevi kapoor;prem;tara;yajamanya;tollywood;district;media;television;hero30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..megastar dupe;chiranjeevi;kumaar;sridevi kapoor;prem;tara;yajamanya;tollywood;district;media;television;heroWed, 03 Feb 2021 11:13:00 GMTహీరో అయినా ఏదో ఒక రిస్కీ సన్నివేశం నుంచి తప్పక పోవడం సహజం. అయితే ఆ రిస్కీ సన్నివేశాన్ని పూర్తి చేయడానికి డూప్ యాక్టర్లు రంగంలోకి దిగుతారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు డూప్ గా యాక్ట్ చేసిన వారు ఎందరో ఉన్నారు కానీ వారి గురించి ప్రజలకు అంతగా తెలియకపోయేది. కానీ ప్రస్తుతం చిన్నపాటి టిక్ టాక్ స్టార్లు కూడా బుల్లితెర ప్రోగ్రాములలో ప్రత్యక్షమయ్యి తమ గురించి ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నారు.

టాలెంట్ ఉన్న వారిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈటీవీ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కనకవ్వ, దుర్గారావు, భాను ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా వేదికగా పాపులర్ అయిన వారిని కూడా బుల్లి తెరకు పరిచయం చేసింది ఈటీవీ. ఇప్పుడు మరొక ముందడుగు వేసి ఎంతో టాలెంట్ ఉండి కూడా తెర వెనుక మగ్గిపోతున్న కళాకారులను తెర ముందుకు తెచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ పేరిట ప్రస్తుతం ఈ టీవీ లో ఒక ప్రోగ్రాం ప్రసారం అవుతోంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఈ టీవీ యాజమాన్యం ప్రతి జిల్లా కి వెళ్లి ఆ జిల్లా లో బాగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

అయితే మొదటిసారిగా ఈటీవీ యాజమాన్యం పశ్చిమగోదావరి జిల్లా కి వెళ్ళగా.. అక్కడ నిర్వహించిన మొదటి షో కి చిరంజీవి డూప్ వచ్చారు. దీనితో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారని ప్రేక్షకులకి మొదటిసారిగా తెలిసింది. ఈ ప్రోగ్రాం ద్వారానే చిరంజీవి డూప్ గా యాక్ట్ చేస్తున్నది ఎవరో ప్రేక్షకులకు తొలిసారిగా తెలిసింది. నిజానికి ఆయనకు "ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్" పేరిట ఒక కంపెనీ కూడా ఉంది. కాగా, ఈ షోలో పాల్గొన్న ప్రేమ్ కుమార్ సమాజంలో డ్యాన్సర్లు అంటే చాలా చిన్నచూపు ఉందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తమలాంటి  వాళ్లకు ఒక ప్లాట్ ఫామ్ ఇచ్చి తమని పాపులర్ చేస్తున్నందుకు గాను ఈటీవీ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


ఊర మాస్ లారీ డ్రైవర్ తో రొమాన్స్ చేస్తానంటున్న రష్మిక

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?

జగడ్డ: ఏకగ్రీవాల కోసం వైసీపీ బెదిరింపులు.. ఏ రేంజ్‌లో అంటే..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>