Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakistan4cd28f08-b811-45c5-8352-cff4ff005b3d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pakistan4cd28f08-b811-45c5-8352-cff4ff005b3d-415x250-IndiaHerald.jpgభారత్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరి నిప్పులు చెరిగే పాకిస్తాన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత్‌తో యుద్ధం కోసం ఎప్పుడూ తహతహలాడే పాక్ ఆర్మీ ఇప్పుడు శాంతి సూక్తులు చెబుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. ఇకపై భారత్‌తో..pakistan;india;pakistan;prime minister;fire;army;allu snehaయుద్ధం వద్దు బాబోయ్.. పాక్ ఆర్మ్ చీఫ్ ఇలా మారిపోయాడేంటి..?యుద్ధం వద్దు బాబోయ్.. పాక్ ఆర్మ్ చీఫ్ ఇలా మారిపోయాడేంటి..?pakistan;india;pakistan;prime minister;fire;army;allu snehaWed, 03 Feb 2021 16:51:18 GMTభారత్ పేరెత్తితేనే అంతెత్తున ఎగిరి నిప్పులు చెరిగే పాకిస్తాన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత్‌తో యుద్ధం కోసం ఎప్పుడూ తహతహలాడే పాక్ ఆర్మీ ఇప్పుడు శాంతి సూక్తులు చెబుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. ఇకపై భారత్‌తో యుద్ధాన్ని కోరుకోమని, భారత్‌తో ఏ పరిస్థితినైనా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తామని ప్రకటిస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మాటలన్నీ అంటోంది.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ జావేద్ బాజ్వా.

పాకిస్తాన్ వైమానిక దళానికి సంబంధించిన ఓ కార్యక్రమం ఈ రోజు జరిగింది. రావల్పిండిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాజ్వా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోని అనేక అంశాలను దగ్గరుండి పరీక్షించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం.. సభనుద్దేశించి మాట్లాడుతూ.. ఉన్నట్లుండి భారత్‌తో సయోధ్య వచనాలు వల్లించడం మొదలు పెట్టారు. భారత్‌తోనే కాదట.. ఏకంగా ప్రపంచ దేశాలన్నింటితోనూ శాంతిగా మెలగాలని, అందుకు ఇదే సరైన సమయమని భారీ ప్రసంగమే ఇచ్చారు. ఆయన ఒక్కసారిగా ఇలా శాంతి సూక్తులు వల్లించడంతో ప్రస్తుతం ఇతర దేశాలు కూడా కొంతమేర షాకవుతున్నాయి.

‘భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని అందించాల్సిన సమయం ఆసన్నమైంది అయితే దీన్ని పాక్ బలహీనతగా భావించకండి. ఈ ప్రకటనకు పెడార్థాలు తీయకండి. ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నాం. జమ్మూ కశ్మీర్ ప్రజల ఇష్టాలను గౌరవించి జమ్మూ-కశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ సామరస్యంగా పరిష్కరించుకోవాలి. పరస్పర గౌరవానికే మేము అత్యధిక ప్రాధాన్యమిస్తాం. ఇదే ఆదర్శానికి మేమే కట్టబడి ఉంటాం. ప్రపంచ దేశాలకు స్నేహ హస్తాన్ని చాటాల్సిన సందర్భమిది.’’ అని బాజ్వా ప్రకటించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఉన్నట్లుండి పాకిస్తాన్ నోట ఇలాంటి శాంతి వచనాలు రావడం, అది కూడా ప్రధాని నోటి వెంట కాకుండా ఏకంగా ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.


మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>