PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా మంది ఎంపీలు ప్రజల్లోకి వెళ్లడం లేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం లో చాలా మంది ఎంపీలు మీడియా ముందు కూడా పెద్దగా రావడం లేదు. ఇక పార్లమెంట్లో కూడా రాయలసీమ సమస్యలను ప్రస్తావించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎంపీలు తమ సమస్యలను తీసుకుని వెళ్లడం లేదు. వెనకబడిన జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రాయలసీమ నుంచysrcp;bharatiya janata party;jagan;andhra pradesh;kadapa;media;uttarandhra;rayalaseema;chief minister;central governmentరాయలసీమ ఎంపీలకు అసలేమైంది...?రాయలసీమ ఎంపీలకు అసలేమైంది...?ysrcp;bharatiya janata party;jagan;andhra pradesh;kadapa;media;uttarandhra;rayalaseema;chief minister;central governmentWed, 03 Feb 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు చాలా మంది ఎంపీలు ప్రజల్లోకి వెళ్లడం లేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం లో చాలా మంది ఎంపీలు మీడియా ముందు కూడా పెద్దగా రావడం లేదు. ఇక పార్లమెంట్లో కూడా రాయలసీమ సమస్యలను ప్రస్తావించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాయలసీమ ప్రాంతంలో చాలా వరకు వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎంపీలు తమ సమస్యలను తీసుకుని వెళ్లడం లేదు.

వెనకబడిన జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో రాయలసీమ నుంచి చాలా మంది ఎంపీలు పెద్దగా కేంద్రం ముందు తమ వాదనలు వినిపించడం లేదు. ఇక రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల నుంచి వెళ్లిన ఎంపీలు ఎవరు కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ లో కూడా అసహనం పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వానికి వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చే బాధ్యత ఉంది.

అయినా సరే ఇవ్వడం లేదు. ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా సరే వెనకబడిన జిల్లాలకు ఇప్పటివరకు ఏమీ రాలేదు. ఉత్తరాంధ్ర ఎంపీలు కూడా పెద్దగా మాట్లాడలేదు. గతంలో రామ్మోహన్ నాయుడు మీడియా ముందు అలాగే పార్లమెంట్లో కూడా గట్టిగా తన వాదనను వినిపించే ప్రయత్నం చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఆయన మాట్లాడకపోవటంతో అసలు ఏంటి అనేది అర్థం కావడం లేదు. అయితే రామ్మోహన్ నాయుడు బీజేపీ దెబ్బకు భయపడుతున్నారు అని అందుకే ఆయన విమర్శలు చేయడం లేదని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉన్న ఎంపీల విషయంలో అసహనంగా ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఫోన్లు చేసి మాట్లాడారని ఇప్పటినుంచైనా వాళ్ళు మాట్లాడతారని కొంతమంది అంటున్నారు.


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>