PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rebels-are-ruin-the-winning-chances-in-pancayats-5384f359-95c1-471b-8117-0de1ede01201-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rebels-are-ruin-the-winning-chances-in-pancayats-5384f359-95c1-471b-8117-0de1ede01201-415x250-IndiaHerald.jpgపంచాయాతీ ఎన్నికలు ఏకంగా పార్లమెంట్ ఎన్నికల కాకను రగిలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి రోజురోజుకూ బాగా పెరిగిపోతోంది. ఏపీలో చాలా విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వచ్చిన తీర్పుని జీర్ణించుకోలేని వారు ఓ వైపు ఉన్నారు. మరో వైపు చూస్తే ఇప్పటికీ ప్రజాభిమానం మాకే అని జబ్బలు చరచే వారు ఇంకో వైపు ఉన్నారు. jagan-nimmagadda-elections;pithe;2019;panchayati;parliment;tdp;ycp;party;mantraజగడ్డ : డేంజర్ బెల్స్ మోగిస్తున్న రెబెల్స్...ఏ పార్టీకి షాక్ ..?జగడ్డ : డేంజర్ బెల్స్ మోగిస్తున్న రెబెల్స్...ఏ పార్టీకి షాక్ ..?jagan-nimmagadda-elections;pithe;2019;panchayati;parliment;tdp;ycp;party;mantraWed, 03 Feb 2021 15:59:07 GMTపార్లమెంట్ ఎన్నికల కాకను రగిలిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ఆసక్తి రోజురోజుకూ బాగా పెరిగిపోతోంది. ఏపీలో చాలా విచిత్రమైన రాజకీయ  పరిస్థితులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వచ్చిన తీర్పుని జీర్ణించుకోలేని వారు ఓ వైపు ఉన్నారు. మరో వైపు చూస్తే ఇప్పటికీ ప్రజాభిమానం మాకే అని జబ్బలు చరచే వారు ఇంకో వైపు ఉన్నారు.

మరి జనం గుండెల్లో అసలు ఉన్నది ఎవరు. ఎవరికి జనం పట్టం కడుతున్నారు అన్నది కూడా చూడాల్సిందే. నిజానికి పంచాయతీ ఎన్నికలు అంటే పార్టీల రంగులు ఉండవు. కానీ ఎపుడైతే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫేస్టో విడుదల చేశారో నాటి నుంచే పంచాయతీ ఎన్నికలు పూర్తి రంగులు అద్దుకున్నాయి. ఈ ఎన్నికల్లో మనమే గెలవాలి అంటూ తెల్లారుతూనే చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా తమ్ముళ్లకు పెద్ద ఎత్తున పిలుపు ఇస్తున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం హడావుడి కూడా మామూలుగా లేదు. ఆ పార్టీ మంత్రులు అయితే తొంబై శాతం పంచాయతీలు తమ పార్టీ ఒడిలోకి వచ్చి వాలిపోతున్నాయి అని గట్టి ధీమాతో ఉంది. అయితే పార్టీ గుర్తులు లేని పంచాయతీల్లో రాజకీయం బహు పసందుగా ఉంది. రెబెల్స్ అనాలో లేదో తెలియదు కానీ ఒకే పార్టీ నుంచి చాలా మంది బరిలోకి దిగిపోతున్నారు. దీని వెనక  పార్టీ నేతల ఉత్సాహం కూడా ఉంది కానీ పై స్థాయిలో పెద్ద నాయకుల ప్రోత్సాహం కూడా ఉంది అంటున్నారు.

అసలు అభ్యర్ధి అంటూ ఫలానా వారిని నిర్ణయించి అంతా మద్దతు ఇచ్చాక చివరి నిముషంలో అదే పార్టీకి చెందిన బడా నాయకుడు మరొకరికి మద్దతు ఇచ్చి రంగంలోకి దింపితే దీన్ని రెబెల్ అనకుండా మరి ఇంకేమనుకోవాలి అని అంటున్నారు. ఈ రెబెల్స్ కనుక ముందుకు దూసుకుపోతే వారి వల్ల ఆయా పార్టీలు బలపరచిన అసలు అభ్యర్ధులకే గట్టి దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే రెబెల్స్ బెడద ఎక్కువగా అధికార వైసీపీలో ఉందని అంటున్నారు. దీంతో కంగారు కలవరం అన్నీ కలసి ఫ్యాన్ పార్టీ పెద్దలకు ఒకేసారి వచ్చేస్తున్నాయట. ఓ వైపు ఏకగ్రీవాలు అంటూంటే ఇపుడీ రెబెల్స్ గోల ఏంటి అని వైసీపీ బడా నేతలు తలలు పట్టుకుంటున్నారుట.




గోధుమ నారు దాచుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??

హెరాల్డ్ సెటైర్: జగన్ మరో చంద్రబాబు అవుతారా ఏంటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>