PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi8826261d-f7be-419b-9e81-d2b4b87e3324-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi8826261d-f7be-419b-9e81-d2b4b87e3324-415x250-IndiaHerald.jpgమీకు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే గుడ్ ఏంటి, దేనికి సంబంధించింది అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త చదివేయండి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఆఫర్లతో ఖాతాదారుల ముందుకు వచ్చింది.sbi;nani;yajamanya;india;sbi;bank;february;good news;customer;fashion;yono;good newwz;oyoఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఆ నాలుగు రోజుల్లో ఏకంగా 50 శాతం తగ్గింపు..!?ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్: ఆ నాలుగు రోజుల్లో ఏకంగా 50 శాతం తగ్గింపు..!?sbi;nani;yajamanya;india;sbi;bank;february;good news;customer;fashion;yono;good newwz;oyoWed, 03 Feb 2021 07:00:00 GMTబ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే గుడ్ ఏంటి, దేనికి సంబంధించింది అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త చదివేయండి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sbi తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఆఫర్లతో ఖాతాదారుల ముందుకు వచ్చింది. యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ తీసుకువచ్చింది. దీని ద్వారా భారీ తగ్గింపు అందిస్తోంది.

ఇక ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నాలుగు రోజుల్లో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయని బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. ఇక ఓయో ద్వారా రూమ్స్ బుకింగ్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లైట్ బుకింగ్‌పై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. యాత్రా.కామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్యాబ్లెట్స్, వాచ్‌లు, శాంసంగ్ మొబైల్స్‌పై 15 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. పెప్పర్‌ఫ్రై ద్వారా ఫర్నీచర్ కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది.

ఇంకా అమెజాన్‌లో పలు కేటగిరిపై కూడా తగ్గింపు అందుబాటులో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ వాలెంటైన్స్ డేకు వారం ముందు ఆఫర్లు ప్రకటించడం విశేషం. ఇంకా ఓయో రూమ్స్‌పై 50 శాతం ఆఫర్ ఉండటం గమనార్హం. ఎస్‌బీఐకి 3.45 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఎస్‌బీఐ కస్టమర్లు కేవలం యోనో ద్వారానే ఈ ఆఫర్లు సొంతం చేసుకోగలరు. యోనో ద్వారా షాపింగ్ చేస్తేనే ఈ బెనిఫిట్ లభిస్తాయి. దీని కోసం ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫ్యాషన్ అండ్ లైఫ్‌లైఫ్‌లోకి వెళ్లాలి. మీకు నచ్చిన ఆఫర్ పొందొచ్చునాని తెలిపారు.


కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>