PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7cbbc24f-69cc-4473-a2d7-a27362c4e313-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7cbbc24f-69cc-4473-a2d7-a27362c4e313-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సభా హక్కుల ఉల్లంఘన ఈ విషయంలో తాజాగా భేటీ అయిన ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో కాస్త వేచి చూడాలి అనే ధోరణిలో ప్రివిలేజ్ కమిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. తమను అవమాన పరిచారని తమ హక్కులను ఉల్లంఘించారని భావిస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో నిమ్మగడ్డ మీద ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ వెంటనే ఈ నోటీసులని ప్రివిలేజ్ కమిటీకి పంపారు. నోటీసులు వచ్చీ రాగానే వైసీపీ ఎమ్మnimmagadda jagan elections;kumaar;kakani govardhan reddy;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;assembly;mla;ycp;reddy;mantraజగడ్డ : నిమ్మగడ్డ 'ప్రివిలేజ్' విషయంలో వెనక్కు తగ్గారా ?జగడ్డ : నిమ్మగడ్డ 'ప్రివిలేజ్' విషయంలో వెనక్కు తగ్గారా ?nimmagadda jagan elections;kumaar;kakani govardhan reddy;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;assembly;mla;ycp;reddy;mantraWed, 03 Feb 2021 15:00:00 GMTనిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సభా హక్కుల ఉల్లంఘన ఈ విషయంలో తాజాగా భేటీ అయిన ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో కాస్త వేచి చూడాలి అనే ధోరణిలో ప్రివిలేజ్ కమిటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. తమను అవమాన పరిచారని తమ హక్కులను ఉల్లంఘించారని భావిస్తూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో నిమ్మగడ్డ మీద ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ వెంటనే ఈ నోటీసులని ప్రివిలేజ్ కమిటీకి పంపారు. నోటీసులు వచ్చీ రాగానే వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ఈ ప్రివిలేజ్ కమిటీ ఆన్లైన్ లో మీట్ అయ్యారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి ఎన్నికల కమిషనర్ మీద మంత్రులు ఇచ్చిన ఫిర్యాదు ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకే వస్తుందని ఆయన మీద విచారణ జరిపే అధికారం మా కమిటీకి ఉందని చెప్పుకొచ్చారు. రూల్ నెంబర్ 173 కింద చర్చించామని న్యాయనిపుణులతో పూర్తిస్థాయిలో మరో సారి చర్చించి నోటీసు పంపించాలా ఇంకా ఏమైనా చేయాలా అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఈ సమావేశంలో అసెంబ్లీ రూల్ నెంబర్ 212, 213 కింద ఎన్నికల కమిషనర్ ని విచారణకు పిలిపించాలని కొంత మంది ప్రివిలేజ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారని అంటున్నారు.  

గతంలో మహారాష్ట్రలో జరిగిన ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఈయనను కూడా పిలిపించాలి అనే ఆసక్తి కనబరిచారట. అయితే ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ కి సర్వాధికారాలు ఉంటాయని ఆయనను పిలిపిస్తే ఎలా అని మరో సభ్యుడు అయిన అనగాని ప్రశ్న లేవనెత్తారట. దీంతో ఈసారి ఆన్లైన్ లో కాదు నేరుగా కలిసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.  కలవాలి అనుకున్నారు కానీ ఎప్పుడు కాలవాలి అనే నిర్ణయం తీసుకోలేదు. ఎందుకో తెలియదు కానీ ఈ ప్రివిలేజ్ నోటీసుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అనే వాదన మాత్రం వినిపిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది కాలమే నిర్ణయించాలి మరి.


జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

జగడ్డ : బాబోరికి పెరిగిపోతున్న గెలుపు ధీమా...రీజన్ అదే ....?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>