PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6c0f6c76-ab2f-4f6c-b22e-4365d47df22f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6c0f6c76-ab2f-4f6c-b22e-4365d47df22f-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.. ఈ విషయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టు ఘటనలో మరోసారి రుజువైంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ అరెస్టునాటి దృశ్యం గుర్తొస్తోంది. అప్పట్లో జగన్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.. నన్ను అరెస్టు చేస్తారా.. ఎవరు నువ్వు.. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటా.. నేను సీఎం అయ్యాక తడాఖా చూపిస్తా అంటూ బెదిరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో సేమ్ సీన్ రిపీటవుతోంది. అచ్చెన్నను అరెస్టు చేసినప్పjagan-nimmagadda-elections;cbn;jeevitha rajaseskhar;jagan;srikakulam;vishakapatnam;police;pistachio;minister;tdp;local language;nijamజగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?jagan-nimmagadda-elections;cbn;jeevitha rajaseskhar;jagan;srikakulam;vishakapatnam;police;pistachio;minister;tdp;local language;nijamWed, 03 Feb 2021 07:07:21 GMTటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టు ఘటనలో మరోసారి రుజువైంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్ అరెస్టునాటి దృశ్యం గుర్తొస్తోంది. అప్పట్లో జగన్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు.. నన్ను అరెస్టు చేస్తారా.. ఎవరు నువ్వు.. మీ అందరినీ గుర్తు పెట్టుకుంటా.. నేను సీఎం అయ్యాక తడాఖా చూపిస్తా అంటూ బెదిరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇప్పుడు శ్రీకాకుళంలో సేమ్ సీన్ రిపీటవుతోంది. అచ్చెన్నను అరెస్టు చేసినప్పుడు ఆయనా ఇలాగే అన్నారు. అచ్చెన్న ఏమన్నారంటే.. నామీద కేసు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి కేసులకు భయపడే వ్యక్తిని కాదు. స్థానిక డీఎస్పీ, సీఐ వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేను మళ్లీ ఛాలెంజ్‌ చేస్తున్నాను. తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. చంద్రబాబుకు చెప్పి హోంమంత్రి పదవి నేనే తీసుకుంటాను. ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నవారంతా ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను బెడ్రూంలో ఉంటే అక్కడికీ వస్తారా? పోలీసులకు ఆ హక్కు ఎవరిచ్చారు? నోటీసు ఇస్తే నేనే వచ్చేవాడిని. అందుకే ఖాకీ డ్రెస్‌ అంటే అసహ్యం వేస్తోంది. ఇలాంటి వారివల్ల మిగిలిన ఉద్యోగులు సిగ్గుపడుతున్నారు అన్నారు అచ్చెన్న.

ఇంకా ఏమన్నారంటే.. “ ఇంత దారుణమైన పరిస్థితులు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఖాకీ డ్రెస్‌ అంటే గౌరవం పోయింది. ఇది అక్రమ అరెస్టు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని జగన్‌మోహన్‌ రెడ్డికి సవాలు విసురుతున్నా. అక్రమ కేసులు పెట్టి ఇలా వేధిస్తున్నందుకు ఫలితం అనుభవిస్తారు. మీ చిన్నాన్నను హత్యచేస్తే ఆ కేసును తేల్చలేకపోయారు. అసలు ఈ కేసుతో నాకు సంబంధం ఏముంది? నేను నా ఇంట్లో ఉన్నాను. జరిగిన ఘటన కనీసం నాకు తెలియదు.. అని అచ్చెన్నాయుడు అన్నారు. అప్పట్లో సవాల్ చేసిన జగన్ ఆ తర్వాత నిజంగానే సీఎం అయ్యారు. మరి అచ్చెన్న కూడా హోంమంత్రి అవుతారా.. ఏమో చెప్పలేం.. ఏమైనా జరగొచ్చు కదా.




కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి ఫెయిల్యూర్ కు కారణాలివేనా ? మరి పవన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>