PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems669f3a88-0b5a-48ec-a95c-7afc8b398fcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teachers-problems669f3a88-0b5a-48ec-a95c-7afc8b398fcc-415x250-IndiaHerald.jpgకరోనా సాకు అడ్డుపెట్టుకుని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు టీచర్ల పొట్టగొడుతున్నాయి. కరోనా ను బూచిగా చూపించి జీతాలు చెల్లించకుండా జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కరోనా ఈ ఏడాది ఉన్నా.. ఏళ్ల తరబడి ఈ యాజమాన్యాలు లక్షలకు లక్షలు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతెందుకు.. కరోనా సమయంలోనూ ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కానీ తమ టీచర్లకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు. కరోనా సాకుతో జీతాలు ఎగ్గొడుతున్నాయి చాలా స్కూలు యాజమాన్యాలు . కరోనాతో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు రెట్టింపయ్యాయి. సాధారణంteachers-problems;telangana;2019;january;marchటీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?teachers-problems;telangana;2019;january;marchWed, 03 Feb 2021 10:05:22 GMT

కరోనా సాకుతో జీతాలు ఎగ్గొడుతున్నాయి చాలా స్కూలు యాజమాన్యాలు . కరోనాతో  ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు వేతన కష్టాలు రెట్టింపయ్యాయి. సాధారణంగానే  ప్రైవేటు స్కూళ్లు రెండు మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తుంటాయి. ఇప్పుడు ఈ  యాజమాన్యాలు  ఏకంగా  ఏడాది నుంచి  వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని స్కూళ్లు జనవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోగా ఇప్పుడు తరగతులు ప్రారంభమైనా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా సాకుతో వేతనాలు ఇచ్చే ఆలోచన చేయడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వాస్తవంగా కరోనా ఎఫెక్ట్‌ గత మార్చి నెలలో ప్రారంభమైంది. కానీ స్కూళ్లు మాత్రం అంతకు ముందు అంటే 2019 డిసెంబరు నుంచే కూడా వేతనాలు చెల్లించడం లేదు. యాజమాన్యాలు  విద్యార్థుల నుంచి 12 నెలలకు ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు మాత్రం 10 లేదా 11 నెలల వేతనాలు మాత్రమే ఇస్తుంటాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ  రాష్ట్రంలో 10,549 ప్రైవేటు పాఠశాలలుండగా వీటిల్లో 1,01,903 మంది టీచర్లు పని చేస్తున్నారు.

ఏడాదిగా  వేతనాలు అందకపోవడంతో వారంతా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు ఇచ్చేలా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. అంటే ప్రైవేటు టీచర్లు నవ భారతాన్నే నిర్మిస్తున్నారు. రేపటి పౌరులను తీర్చిదిద్దుతున్నారు. కానీ వారి జీవితాల్లో మాత్రం ఇప్పుడు చీకటే అలముకుంది.




నన్నేమీ అడక్కుండానే నాపై సినిమా..ఆ సినిమాలోలా నేనస్సలు చేయలేదు..షకీలా సంచలన వ్యాఖ్యలు..?

జ‌న‌సేన‌కు ఏక‌గ్రీవాలు... వామ్మో దీనికే సంబ‌రాలా ?

చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?

దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>