PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cooking-oil-rates-hike-with-central-budgetda661f0f-c8f2-4443-939e-2a0d0c329416-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cooking-oil-rates-hike-with-central-budgetda661f0f-c8f2-4443-939e-2a0d0c329416-415x250-IndiaHerald.jpg100 రూపాయలకు కాస్త అటు ఇటుగా ఉన్న వంట నూనెల ధరలు.. లీటరు 150కి చేరువయ్యాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావంతో పామాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితి గమనిస్తుంటే లీటర్ వంట నూనె రూ.200కి చేరువయ్యే రోజు ఎంతో దూరంలో లేదని తేలిపోతోంది. ఏడాది చివరకి వరకూ ఆగకుండానే లీటర్ రూ.200 కి చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా. cooking oil rates hike;oil;aqua;vegetable market;central governmentవంటనూనె.. లీటర్ రూ.200కి చేరుకుంటుందా..?వంటనూనె.. లీటర్ రూ.200కి చేరుకుంటుందా..?cooking oil rates hike;oil;aqua;vegetable market;central governmentWed, 03 Feb 2021 08:00:00 GMTకేంద్ర బడ్జెట్ ప్రభావంతో పామాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితి గమనిస్తుంటే లీటర్ వంట నూనె రూ.200కి చేరువయ్యే రోజు ఎంతో దూరంలో లేదని తేలిపోతోంది. ఏడాది చివరకి వరకూ ఆగకుండానే లీటర్ రూ.200 కి చేరుకుంటుందని మార్కెట్ వర్గాల అంచనా.

ఇప్పటి వరకూ కేంద్రం ముడి పామాయిల్ పై 27.50 శాతం పన్ను వసూలు చేస్తోంది. కొత్త బడ్జెట్ లో ఈ పన్ను శాతాన్ని 35.75కి పెంచారు. దీంతో ఒక్కసారిగా పామాయిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రూ.4 రూపాయలు పెరిగి లీటర్ ప్యాకెట్ రేటు రూ.113కి పెరిగింది. డిసెంబరులో 99 రూపాయలుగా ఉన్న లీటర్ ప్యాకెట్ ధర.. ఇప్పుడు 113రూపాయలంటే.. 14రూపాయల వ్యత్యాసం ఉంది. నెల రోజుల వ్యవధిలోనే రేటు భారీగా పెరిగిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ వాడకం ఎక్కువ. మిగతా నూనెలతో పోల్చి చూస్తే తక్కువ ధరకు లభిస్తుండటంతో ఇంట్లో అవసరాలకు, హోటళ్లు, ఆహార పదార్థాల తయారీ కంపెనీల్లో కూడా పామాయిల్ నే ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు పామాయిల్ రేటు భారీగా పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

మరోవైపు సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె రేట్లు దాదాపుగా సమానం అయ్యాయి. వేరు శెనగ నూనె లీటర్ రూ.142కాగా.. సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.141గా ఉంది. నువ్వుల నూనె రికార్డు స్థాయిలో టన్ను రూ.2.48లక్షలకు చేరింది.

పామాయిల్ దిగుబడి తక్కువగా ఉండటం, చైనాపై ఆధారపడాల్సి రావడంతో.. రాష్ట్రంలో పామాయిల్ రేటు భారీగా పెరగడానికి మరో కారణంగా తెలుస్తోంది. ధరలు పెరగడంతో కల్తీ ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. చౌకగా దొరికే పత్తిగంజల నూనెతో ఇతర వంట నూనెలను కల్తీ చేస్తారని, అందుకే విడి నూనె కొనడం తగ్గించాలని నాణ్యమైన నూనెలను కొనాలని చెబుతున్నారు.

మొత్తమ్మీద ఈ ఏడాది చివరిలోగా వంట నూనెలు రూ.200 మార్కు దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. కరోనా కష్టకాలంలో రవాణా సౌకర్యాలు లేక రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకపోయినా రేట్లు తగ్గలేదు. బడ్జెట్ తో ఇప్పుడు మరిన్ని కష్టాలు వస్తున్నాయి. 


ఆ విషయంలో బీజేపి- జనసేన మౌనం ఎందుకో..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>