Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-kanth246e219d-7b40-4806-8461-655dbc467d4a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajini-kanth246e219d-7b40-4806-8461-655dbc467d4a-415x250-IndiaHerald.jpg సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ నిజం చేస్తూ గతేడాది రజనీకాంత్ స్వయంగా పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ పేరు, గుర్తు.. జెండా... ఇలా అన్నింటికి సంబంధించి కూడా ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఇంతలో ఆయన అనారోగ్యం పాలవ్వడం, ఆసుపత్రిలో..rajini kanth;rajinikanth;tiru;india;mohandas karamchand gandhi;rajani kanth;tamil;assembly;chennai;march;v;partyరజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!rajini kanth;rajinikanth;tiru;india;mohandas karamchand gandhi;rajani kanth;tamil;assembly;chennai;march;v;partyWed, 03 Feb 2021 13:24:34 GMTచెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నింటికీ నిజం చేస్తూ గతేడాది రజనీకాంత్ స్వయంగా పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. పార్టీ పేరు, గుర్తు.. జెండా... ఇలా అన్నింటికి సంబంధించి కూడా ప్రకటన చేస్తానని చెప్పారు. దీంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ఇంతలో ఆయన అనారోగ్యం పాలవ్వడం, ఆసుపత్రిలో పడడంతో ఉన్నట్లుండి రజినీ తన స్టాండ్ మార్చేశారు. తాను రాజకీయాల్లోకి రానని, తనను అభిమానులంతా క్షమించాలని అన్నారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో మంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు కూడా చేశారు. కానీ రజినీ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధపడలేదు. దీంతో అభిమానులు కూడా వెనక్కి తగ్గడం ప్రాంరభించారు. అయితే ఇలాంటి సమయంలో మళ్లీ రజినీ రాజకీయ ఎంట్రీపై ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రానని ప్రకటించలేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ ఎన్నికలలో మాత్రమే పోటీచేయనని చెప్పారి ఆయన సన్నిహితుడు, గాంధీ మక్కల్‌ ఇయక్కం నేత తమిళురువి మణియన్‌ మంగళవారం ఓ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రజనీ ఆరోగ్య పరిస్థితుల సహకరించవని, అందువల్లనే ముందుగా ప్రకటించినట్లుగా రాజకీయ పార్టీని రజినీ ప్రారంభింలేదని అన్నారు. రజనీ మక్కల్‌ మండ్రం నాయకులు, సభ్యులు గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌లో సభ్యత్వం కల్పించాలని తనను కోరుతున్నారని ఆయన తెలిపారు. మార్చి 7న తిరుప్పూరులో గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ సర్వసభ్య మండలి సమావేశం నిర్వహించబోతున్నానని, ఆ సమావేశంలో మరింత సమాచారాన్ని వెల్లడిస్తానని మణియన్ తెలిపారు.

‘రజనీ మక్కల్‌ మండ్రం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తాను ఓ విషయాన్ని స్పష్టం చేయదలిచాను. గాంధీ మక్కల్‌ ఇయక్కమ్‌ను ప్రజాసేవ కోసమే నడుపుతున్నాను. రాజకీయ ప్రయోజనాలకు కాదు. రజనీ పార్టీని ప్రారంభించడం లేదని మాత్రమే చెప్పారు. అంతేకానీ ఎక్కడా రాజకీయ ప్రవేశం చేయనని ప్రకటించలేదు. అంతేకాదు రజనీకాంత్ మక్కల్‌ మండ్రాలను రద్దు చేయకుండా కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అభిమానులంతా గుర్తుంచుకోవాలి. ఈ పరిస్థితుల్లో రజనీ మక్కల్‌ మండ్రం నేతలు, అభిమాన సంఘాల నిర్వాహకులు విరక్తితో ఇతర పార్టీల్లో చేరుతుండటం బాధకలిగిస్తోంద’ని తమిళురువి మణియన్‌ అన్నారు.




జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>