Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-police-offered-one-lac-for-informing-about-deep-siddua5a4380a-864b-43cd-bfcb-c072a8ab0da5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-police-offered-one-lac-for-informing-about-deep-siddua5a4380a-864b-43cd-bfcb-c072a8ab0da5-415x250-IndiaHerald.jpg గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఆందోళనలు ఎంత హింసాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. ఈ హింసాకాండలో ఎంతో మంది పోలీసులు గాయాలపాలయ్యారు. అక్కడితో ఆగని ఆందోళనకారులు ప్రతిష్ఠాత్మకమైన ఎర్రకోటపైకి ఎక్కి అక్కడ సిక్కు జెండా ఎగురవేసి భారీ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ హింసాకాండ కేసులో..deep siddu;monica;delhi;bollywood;police;prize;gift;central government;sardar vallabhai patelఆచూకీ చెబితే లక్ష.. ఢిల్లీ పోలీసుల బంపర్ ఆఫర్.. ఇంతకీ ఎవరి గురించంటే..ఆచూకీ చెబితే లక్ష.. ఢిల్లీ పోలీసుల బంపర్ ఆఫర్.. ఇంతకీ ఎవరి గురించంటే..deep siddu;monica;delhi;bollywood;police;prize;gift;central government;sardar vallabhai patelWed, 03 Feb 2021 14:08:00 GMTన్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఆందోళనలు ఎంత హింసాత్మకంగా మారాయో అందరికీ తెలిసిందే. ఈ హింసాకాండలో ఎంతో మంది పోలీసులు గాయాలపాలయ్యారు. అక్కడితో ఆగని ఆందోళనకారులు ప్రతిష్ఠాత్మకమైన ఎర్రకోటపైకి ఎక్కి అక్కడ సిక్కు జెండా ఎగురవేసి భారీ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. ఈ హింసాకాండ కేసులో బాలీవుడ్ నటుడు దీప్ సిద్ధూ ప్రధాన నిందితుడని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అయితే అతడిని పట్టుకోవడం మాత్రం పోలీసులకు కుదరకపోవడంతో ఇప్పుడు వారంతా ఓ బంపర్ ఆఫర్‌తో ప్రజల ముందుకొచ్చారు. అదేంటంటే ఎవరైతే దీప్ సిద్దూ ఆచూకీ చెబుతారో వారికి అక్షరాలా లక్షరూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాకాండలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్‌లతో కూడిన జ్యుడీషియరీ బెంచ్ తిరస్కరించింది. అంతేకాకుండా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ బంపర్ ఆఫర్‌ను పోలీసులు ప్రకటించారు.

‘ఎర్రకోటపై సిక్కు పతాకాలను ఎగురవేసిన దీప్ సిద్ధూ, జుగరాజ్ సింగ్, దీప్ సిద్ధూ మరో ఇద్దరు సహచరుల ఆచూకీ చెబితే లక్షరూపాయల నగదు బహుమతులు ఇస్తాం’ అని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

ఈ కేసులో మిగిలిన నిందితులైన జజ్బీర్ సింగ్, బూటాసింగ్, సుఖదేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్‌ల ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల చొప్పున నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రకటన కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం జాయింట్ కమిషనర్ బీకే సింగ్ వెలువరించడంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసును బీకే సింగ్ నేతృత్వంలో డీసీపీలు జాయ్ టుర్కీ, భేషంసింగ్, మోనికా భరద్వాజ్‌లు దర్యాప్తు చేస్తున్నారు.




బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>