MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-their-situation-like-thisc6f8bb66-60a7-40f1-8051-cc6b263694df-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-their-situation-like-thisc6f8bb66-60a7-40f1-8051-cc6b263694df-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరుగులు పెడుతుంది. ఎంత పెద్ద బ్యాక్ ‌గ్రౌండ్‌ ఉన్నా, సక్సెస్‌లేకపోతే కెరీర్‌ కష్టాల్లో పడుతుంది. ఇండస్ట్రీ కూడా మరిచిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కొంతమంది దర్శకులు ఇలాంటి స్టేజ్‌లోనే ఉన్నారు. కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన స్టేజ్‌లో పడిపోయారు. మరి ఒక్కహిట్‌ ప్లీజ్ అంటోన్న ఆ మేకర్స్‌ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్ శ్రీను వైట్ల. చిరంజీవి, మహేశ్ బాబు లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేశాడు. 'ఢీ, రెడీ, దూకుడు' లాంటి హిట్స్what is their situation like this;chiranjeevi;mahesh;prabhas;akhil akkineni;bhaskar;nageshwara rao akkineni;srinu vytla;cinema;baba bhaskar;industry;comedy;shadow;mister;paruguవీళ్ల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..!వీళ్ల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..!what is their situation like this;chiranjeevi;mahesh;prabhas;akhil akkineni;bhaskar;nageshwara rao akkineni;srinu vytla;cinema;baba bhaskar;industry;comedy;shadow;mister;paruguWed, 03 Feb 2021 18:00:00 GMTఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరుగులు పెడుతుంది. ఎంత పెద్ద బ్యాక్ ‌గ్రౌండ్‌ ఉన్నా, సక్సెస్‌లేకపోతే కెరీర్‌ కష్టాల్లో పడుతుంది. ఇండస్ట్రీ కూడా మరిచిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కొంతమంది దర్శకులు ఇలాంటి స్టేజ్‌లోనే ఉన్నారు. కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన స్టేజ్‌లో పడిపోయారు. మరి ఒక్కహిట్‌ ప్లీజ్ అంటోన్న ఆ మేకర్స్‌ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్ శ్రీను వైట్ల. చిరంజీవి, మహేశ్ బాబు లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేశాడు. 'ఢీ, రెడీ, దూకుడు' లాంటి హిట్స్‌తో టాప్‌ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే 'ఆగడు' తర్వాత వైట్లకి వరుస ఫ్లాపులొచ్చాయి. 'మిస్టర్, అమర్‌ అక్బర్ ఆంటోని' డిజాస్టర్స్‌తో శ్రీను వైట్ల కెరీర్‌ కూడా ప్రశ్నార్ధకంలో పడింది.

శ్రీను వైట్ల పనైపోయిందని, ఒకే రకమైన కథలతో ఆడియన్స్‌ని ఇరిటేట్ చేస్తున్నాడనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఇలాంటి టైమ్‌లో తనకి సూపర్‌ స్టార్డమ్ తెచ్చిపెట్టిన 'ఢీ' సీక్వెల్ మొదలుపెట్టాడు. 'డీ అండ్ డీ-డబుల్ డోస్' పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇక స్లంపులోనుంచి బయటపడాలనుకుంటోన్న మంచు విష్ణు కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

'బొమ్మరిల్లు' సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఒకే ఒక్క హిట్‌తో టాలీవుడ్‌ని తనవైపు తిప్పుకున్న ఈ దర్శకుడు 'ఒంగోలు గిత్త' తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక జనాలంతా మర్చిపోతోన్న టైమ్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. లాంచింగ్‌ నుంచి సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ కోసం చూస్తోన్న అక్కినేని అఖిల్, ఈ మూవీతో ట్రాక్ ఎక్కాలని ఆశపడుతున్నాడు.

స్టైలిష్‌ మూవీ మేకింగ్‌తో స్టార్‌ హీరోస్‌ని కూడా ఇంప్రెస్‌ చేస్తోన్న దర్శకుడు మెహర్‌ రమేశ్. ప్రభాస్, జూ.ఎన్టీఆర్‌ లాంటి స్టార్స్‌ని డైరెక్ట్‌ చేసినా హిట్స్‌లేని రమేశ్, 'షాడో' తర్వాత మరో సినిమా తీయలేదు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు.  చిరుతో 'లూసిఫర్' రీమేక్‌ చేయబోతున్నాడు రమేశ్. మరి స్లంపులో ఉన్న డైరెక్టర్లు చేస్తోన్న ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్‌ అందుకుంటారో చూడాలి. 


ఏపిలో పదోతరగతి షెడ్యూల్ ను విడుదల చేసిన సర్కార్..

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>