PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-bills881f1ab4-1468-4978-9714-3679b1318f0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-bills881f1ab4-1468-4978-9714-3679b1318f0a-415x250-IndiaHerald.jpgరైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని గత కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్ ని కేంద్రం అంగీకరించింది. ఇందుకు రాజ్యసభలో రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. రాజ్యసభలో జరిగే ఈ చర్చలో విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని కాకపోతే చర్చ అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.farmers;sanjay singh;joshiy;delhi;bharatiya janata party;congress;rajya sabha;mp;capital;parliment;minister;central government;zeroరైతు సమస్యలపై రెండు రోజుల చర్చకు ఆమోదం తెలిపిన కేంద్రం... కాకపోతే!రైతు సమస్యలపై రెండు రోజుల చర్చకు ఆమోదం తెలిపిన కేంద్రం... కాకపోతే!farmers;sanjay singh;joshiy;delhi;bharatiya janata party;congress;rajya sabha;mp;capital;parliment;minister;central government;zeroWed, 03 Feb 2021 18:15:00 GMTఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో దేశవ్యాప్తంగా గల రైతులు, రైతు సంఘాల పేరిట చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా చేస్తున్న ఈ పోరాటం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ఐక్యరాజ్య సమితి సైతం వీరి పోరాటానికి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, ఈ నూతన వ్యవసాయ చట్టాల రద్ధు అంశంపై చర్చించాలని పార్లమెంట్ నిర్ణయించింది. రైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని గత కొంతకాలంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్ ని కేంద్రం అంగీకరించింది. ఇందుకు రాజ్యసభలో రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. రాజ్యసభలో జరిగే ఈ చర్చలో విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలను నివృత్తి చేస్తామని కాకపోతే చర్చ అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.




రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే రైతుల సమస్యలు, వ్యవసాయ చట్టాలపై చర్చ మొదలవుతుందని, ఇది రెండు రోజుల పాటు సాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు బుధవారం ఉదయం సభలో ప్రకటించారు. సభ ప్రారంభమైన తరువాత రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని, ఇందుకు ఐదు గంటలు కేటాయించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై వెంటనే చర్చించాలని పట్టుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈ విషయమై నినాదాలు చేస్తూనే ఉండటంతో, వారిని సభ నుంచి సస్పెండ్ చేసిన చైర్మన్, ఆపై సభను వాయిదా వేశారు. ఆ వెంటనే పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటన విడుదల చేశారు. విపక్ష సభ్యుల డిమాండ్‌ను అంగీకరిస్తూ 15 గంటల పాటు రైతు సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని ఆయన తెలిపారు. రైతులకు మేలు చేయాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్.. ‘మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించినందున రైతుకు సంబంధించిన అన్ని సమస్యలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ముందే ఇది జరగాలని, లేదంటే మరింత ఎక్కువ సమయం కేటాయించాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక రెండు రోజుల పాటు ప్రైవేటు మెంబర్ బిల్లులను, సభ్యులు లేవనెత్తే సమస్యలపై చర్చలకు అనుమతించబోమని రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఆఫ్ ఎంపీలు సంజయ్ సింగ్, సుశీల్ గుప్తా, ఎన్డీ గుప్తాలను సభ నుంచి ఈ రోజంతా బహిష్కరించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు జీరో అవర్ అనంతరం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ప్రయత్నించారు. అయితే ఇంతలో ముగ్గురు ‘ఆప్’ ఎమ్మెల్యేలు తమ సీట్లలో నుంచి లేచి నిలుచుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.




ప్రభాస్ షూటింగ్ లో ప్రమాదానికి కారణం అదే అంటూ తేల్చేసిన అధికారులు

సర్కారు వారి పాట సాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కొత్త రికార్డు సృష్టించిన సూపర్ స్టార్....

జగడ్డ: పదవీకాలం పెంపుపై కోర్టుకు వెళ్లనున్న నిమ్మగడ్డ...?

బడ్జెట్ పై పీపుల్ స్టార్ ఆగ్రహం..ఇది పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్

అమ్మో.. డార్లింగ్ ప్రభాస్ తో నటించడానికి ఈ చిన్నది ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందా?

మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>