PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/is-really-lokesh-has-that-much-guts-to-contest-in-produtturdf4af3e3-eb63-4351-bd65-cf0ba75218fb-415x250-IndiaHerald.jpg కాకపోతే ఇక్కడ ఆర్కేకు కూడా మంచి పేరుంది. పైగా అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పంచాయితీ ఎన్నికల్లో ఆర్కేకు చెక్ పెట్టడం లోకేష్‌కు కాస్త కష్టమనే చెప్పొచ్చు. అక్కడి ప్రజలు రాజధాని అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టీడీపీ సత్తా చాటుతుంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న చినబాబు ఈ పంచాయితీ ఎన్నికల్లోనైనా మంచి విజయాలని అందుకోవాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా మంగళగిరి టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తూ, పంచాయితీల్లో టీడీపీ జెండా ఎగరవేసేలా lokesh;lokesh;jagan;nara lokesh;2019;capital;assembly;mla;cheque;mangalagiri;alla ramakrishna reddy;letter;tdp;success;ycp;lokesh kanagaraj;tadepalli;s radhakrishna;party;sajjala ramakrishna reddyచినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?చినబాబుకు భలే ఛాన్స్...సక్సెస్ అవుతారా ?lokesh;lokesh;jagan;nara lokesh;2019;capital;assembly;mla;cheque;mangalagiri;alla ramakrishna reddy;letter;tdp;success;ycp;lokesh kanagaraj;tadepalli;s radhakrishna;party;sajjala ramakrishna reddyWed, 03 Feb 2021 09:15:00 GMT2019 ఎన్నికల్లో సంచలన ఫలితాలు చాలానే వచ్చాయి. అందులో నారా లోకేష్ ఓటమి కూడా ఒకటి. తొలిసారి బరిలో దిగిన లోకేష్ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే లోకేష్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. చంద్రబాబు తనయుడుగా, టీడీపీకి కాబోయే అధ్యక్షుడుగా లోకేష్ గెలుపుపై బాగానే అంచనాలు ఉన్నాయి. పైగా రాజధాని ప్రాంతం. దీంతో లోకేష్ గెలుపు సులువని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా లోకేష్, జగన్ వేవ్‌లో ఘోరంగా ఓడిపోయారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో 7 వేల మెజారిటీ తేడాతో ఓటమి పాలయ్యారు.

అయితే లోకేష్ ఓడిపోవడం, పార్టీ కూడా ఓడిపోవడం జరిగాయి. ఇక లోకేష్ ఓడిపోయాక, మంగళగిరి మళ్ళీ వెళ్లరు అనుకున్నారు. కానీ లోకేష్ మంగళగిరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. అక్కడి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగానే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఆర్కేకు కూడా మంచి పేరుంది. పైగా అధికార ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పంచాయితీ ఎన్నికల్లో ఆర్కేకు చెక్ పెట్టడం లోకేష్‌కు కాస్త కష్టమనే చెప్పొచ్చు.

అక్కడి ప్రజలు రాజధాని అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా టీడీపీ సత్తా చాటుతుంది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న చినబాబు ఈ పంచాయితీ ఎన్నికల్లోనైనా మంచి విజయాలని అందుకోవాలని కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా మంగళగిరి టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తూ, పంచాయితీల్లో టీడీపీ జెండా ఎగరవేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. ఇక్కడ మున్సిపాలిటీలని పక్కనబెట్టేస్తే, ఈ మూడు మండలాల్లో ఉండే పంచాయితీల్లో వైసీపీ ఎంత బలంగా ఉందో, టీడీపీ కూడా అంతే బలంగా ఉంది. చాలాచోట్ల వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అలాగే ఇక్కడ టీడీపీ మంచి విజయాలని సాధించేలా కనిపిస్తోంది. పలుచోట్ల ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు బెదిరింపులకు దిగుతున్న కూడా టీడీపీ మద్ధతుదారులు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. ఇలా వైసీపీకి ధీటుగా టీడీపీ మంగళగిరిలో సగం పంచాయితీలని గెలుచుకున్నా చినబాబు బలం పెరిగినట్లే. 


దుబాయ్ వెళ్లిన దిల్ రాజు... ఆ సెటిల్మెంట్ కోసమేనా ?

షాకింగ్: చైనాకు దిమ్మతిరిగే ఇండియా వార్త..?

ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>