PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sec-rides203465b8-0b35-4fa0-a511-416d99ca8c3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sec-rides203465b8-0b35-4fa0-a511-416d99ca8c3e-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు పంచాయితీ ఎన్నికలు, మరో వైపు ఇసుక దందాలు జోరుగా సాగుతున్నాయి. రెండో విడత నామినేషన్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలను నాయకులు ఎటువంటి ప్రలోభాలకు గురి చెయ్యనియ్యకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు భారీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎక్కడిక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.ఇందులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మాత్రం కాస్త ఎక్కువగా చొరవ తీసుకుని మెరుపు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు నిర్వహించిన దాడిలో భారీగా అక్రమ రవాణా చేస్తున్న మద్యం ను పట్టుకsec rides;andhra pradesh;district;police;panchayati;sara shrawan;dookuduదూకుడును పెంచిన ఎస్‌ఈబీ.. భారీగా మద్యం పట్టివేత..దూకుడును పెంచిన ఎస్‌ఈబీ.. భారీగా మద్యం పట్టివేత..sec rides;andhra pradesh;district;police;panchayati;sara shrawan;dookuduWed, 03 Feb 2021 07:04:18 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు పంచాయితీ ఎన్నికలు, మరో వైపు ఇసుక దందాలు జోరుగా సాగుతున్నాయి. రెండో విడత నామినేషన్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలను నాయకులు ఎటువంటి ప్రలోభాలకు గురి చెయ్యనియ్యకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు భారీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఎక్కడిక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.ఇందులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మాత్రం కాస్త ఎక్కువగా చొరవ తీసుకుని మెరుపు దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు నిర్వహించిన దాడిలో భారీగా అక్రమ రవాణా చేస్తున్న మద్యం ను పట్టుకున్నారు. 


మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరింత దూకుడు పెంచింది. గడచిన పది రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నది. గత నెల 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించిన దాడులు, కేసుల వివరాలను ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలోని 18 పోలీస్‌ యూనిట్లలో ఎన్నికల కోసం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎస్‌ఈబీకి చెందిన ఏఎస్పీలకు నోడల్‌ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.


ఇప్పటి వరకు 11,034 మందిని బైండోవర్‌ చేశారు. మద్యం, నగదు తరలిస్తున్న వారిని గుర్తించి 1,728 కేసులు నమోదు చేసి 1,262 మందిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించారు. 39 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద 3.799 కిలోల బంగారు ఆభరణాలు, 3.42కిలోల బంగారం, 439.11 కెరట్స్‌ వజ్రాలను స్వాదీనం చేసుకున్నారు.. నిన్న కడపలో ఎన్నికలకు సంబంధించిన 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే కర్నూల్ జిల్లాలోఎస్‌ఈబీ ప్రత్యేక బృందాల దాడుల్లో 10,137 లీటర్ల నాటుసారా , 5,068 లీటర్ల మద్యం, 2,981 లీటర్ల బీరును స్వాదీనం చేసుకున్నారు.



కరోనాని మించిన మరో మహమ్మారి ‘‘క్యాండిడా ఆరిస్‌’’ ప్రపంచాన్ని ముంచేయనుందా?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>