PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-latest-news5e8f7a18-7020-4722-9355-1b28630a2b09-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-latest-news5e8f7a18-7020-4722-9355-1b28630a2b09-415x250-IndiaHerald.jpgమంగళవారం రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పట్టాభిపై దాడి జరగడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఈ దాడికి సంబందించి సి‌సి టి‌వి వీడియోలు బయట పడడంతో దాడి పక్క పథకం ప్రకారమే జరిగిందని తెలుస్తుంది. మంగళవారం విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని తన నివాసం నుంచి బయలుదేరిన పట్టాభి కారు పక్క వీధిలోకి తిరిగి వెళ్తుండగా దాదాపు పది మంది దుండగులు రాళ్లు, కర్రలతో అన్ని వైపుల చుap latest news;telugu desam party;telugu;police;media;cm;chief minister;car;minister;letter;tdp;ycp;reddy;partyపట్టాభినే ఎందుకు టార్గెట్ చేశారు..ఎవరు చేశారు ??పట్టాభినే ఎందుకు టార్గెట్ చేశారు..ఎవరు చేశారు ??ap latest news;telugu desam party;telugu;police;media;cm;chief minister;car;minister;letter;tdp;ycp;reddy;partyWed, 03 Feb 2021 09:03:05 GMTతెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామయ్యపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పట్టాభిపై దాడి జరగడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి. ఈ దాడికి సంబందించి సి‌సి టి‌వి వీడియోలు బయట పడడంతో దాడి పక్క పథకం ప్రకారమే జరిగిందని తెలుస్తుంది. మంగళవారం విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని తన నివాసం నుంచి బయలుదేరిన పట్టాభి కారు పక్క వీధిలోకి తిరిగి వెళ్తుండగా దాదాపు పది మంది దుండగులు రాళ్లు, కర్రలతో అన్ని వైపుల చుట్టుముట్టి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో పట్టాభి కారు ధ్వంసమై పోగా, పట్టాభికి చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి సమయంలో కారు డ్రైవరు వెంటనే అప్రమత్తమై, చాకచక్యంగా వ్యవహరించి, కారును డ్రైవర్‌ వేగంగా నడిపి ఇంటికి చేర్చడంతో దుండగుల దాడి నుంచి తాను ప్రాణాలతో బయటపడగలిగానని పట్టాభి వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పట్టాభి ఇంటికి తరలివచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పట్టాభి ఇంటికి వచ్చి పరామర్శించారు. అయితే ఈ దాడిని ఎవరు చేయించారు..? ఎందుకు చేయించారు .? అన్న దానిపై టి‌డి‌పి నేతలు తమ వాదనను వినిపిస్తున్నారు.

 ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించినందుకే పట్టాభిపై కక్ష కట్టారని, ప్రశ్నిస్తే చంపేస్తారా..! అంటూ టి‌డి‌పి నేతలు ద్వజమెత్తారు. ఈ ఘటనకు సమాధానం చెప్పాలని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు,గాయాలతో ఉన్న పట్టాభిని తీసుకుని సీఎం ఇంటికి వెళ్లేందుకు బయల్దేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటన గురించి పట్టాభి మాట్లాడుతూ " ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ.. మీడియా చర్చావేదికల్లో గట్టిగా ప్రశ్నిస్తున్నందునే వైసీపీ నాయకులు నాపై కక్ష గట్టారు. నన్ను అంతమొందించే లక్ష్యంతో దాడి చేశారు. పాలకుల అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తారా? ఇలాంటి దాడులకు భయపడను. పోలీసులపై నమ్మకం పోయింది " అంటూ పట్టాభి మీడియాతో తెలిపాడు.


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>