MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-team-full-thinking-about-thatb772aa49-4de7-48a7-a35f-9e36aecdabd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-movie-team-full-thinking-about-thatb772aa49-4de7-48a7-a35f-9e36aecdabd3-415x250-IndiaHerald.jpgనట సింహం నందమూరి బాలకృష్ణ 2019లో మొత్తం మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . అందులో ముందుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు సినిమాలు రెండూ కూడా మంచి అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. అయితే ఈ సినిమా కూడా ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. balayya;ntr;balakrishna;krish;simhaa;thaman s;cinema;nandamuri balakrishna;media;k s ravikumar;december;ruler;success;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;dwaraka;simha;massఆ విషయంలో తీవ్ర ఆలోచన చేస్తున్న బాలయ్య మూవీ టీమ్ ..... ??ఆ విషయంలో తీవ్ర ఆలోచన చేస్తున్న బాలయ్య మూవీ టీమ్ ..... ??balayya;ntr;balakrishna;krish;simhaa;thaman s;cinema;nandamuri balakrishna;media;k s ravikumar;december;ruler;success;gottipati ravi kumar;nandamuri taraka rama rao;miryala ravinder reddy;reddy;legend;dwaraka;simha;massWed, 03 Feb 2021 23:51:21 GMTనందమూరి బాలకృష్ణ 2019లో మొత్తం మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు . అందులో ముందుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహనాయకుడు సినిమాలు రెండూ కూడా మంచి అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తరువాత అదే ఏడాది డిసెంబర్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. అయితే ఈ సినిమా కూడా ఏ మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.

అనంతరం తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటికి తదుపరి ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రొల్ చేస్తున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మంచి మాస్ యాక్షన్ మూవీ గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్నట్లు టాక్. ఇక ఈ సినిమా టైటిల్ విషయమై పలు పేర్లు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అయితే ముఖ్యంగా మోనార్క్, బలరామయ్య అనే టైటిల్స్ ప్రచారం అవుతుండగా వీటిలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతాయని అందరూ భావించారు. అయితే ఫైనల్ టైటిల్ విషయమై కొద్దిరోజులుగా యూనిట్ ఎంతో ఆలోచన చేస్తోందని, పక్కాగా ఇంకా ఇది ఫిక్స్ కాలేదని అంటున్నారు. కాగా అతి త్వరలో ఫైనల్ టైటిల్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి సమ్మర్ కానుకగా మే 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక మూడు నెలలు వెయిట్ చేయాలి.......!!


ఆ రహస్యం బయటపడింది.. ఇక పాకిస్తాన్‌ కొంపకొల్లేరే..?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>