EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pukarlu-nammoddu-rashtramlo-evarikii-karoonaa-sokaledud30dcde5-58b1-4ee9-80f9-cea08cd43c9e-415x250-IndiaHerald.jpgతెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ గ‌డిచిన కొద్ది రోజులుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ త‌రుచూ ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన వార్త వ‌న‌రుగా మారుతున్నారు. కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ముఖ్య‌మంత్ర‌యితే త‌ప్పేంటి..? అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తూ టీఆర్ ఎస్ పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు దారితీశారు. ఆ త‌ర్వాత అనేక మంది ఆ ప‌ల్లవి అందుకోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని చెప్పాలి. తాజాగా రైతుబంధు ప‌థ‌కంలో లోపాల‌ను బ‌య‌ట‌పెడుతూ వ్యాఖ్య‌నించారు. కొనుగోలు కేంద్రాల‌ను కొన‌సాగించాల్సిందేనంటూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి etela;kcr;ktr;tiru;delhi;bharatiya janata party;telangana;minister;central government;nijam;dookudu;party;mantraటీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..etela;kcr;ktr;tiru;delhi;bharatiya janata party;telangana;minister;central government;nijam;dookudu;party;mantraWed, 03 Feb 2021 07:26:00 GMTతెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ గ‌డిచిన కొద్ది రోజులుగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ త‌రుచూ ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన వార్త వ‌న‌రుగా మారుతున్నారు. కొద్దిరోజుల క్రితం కేటీఆర్ ముఖ్య‌మంత్ర‌యితే త‌ప్పేంటి..? అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తూ టీఆర్ ఎస్ పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌కు దారితీశారు. ఆ త‌ర్వాత అనేక మంది ఆ ప‌ల్లవి అందుకోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని చెప్పాలి. తాజాగా రైతుబంధు ప‌థ‌కంలో లోపాల‌ను బ‌య‌ట‌పెడుతూ వ్యాఖ్య‌నించారు. కొనుగోలు కేంద్రాల‌ను కొన‌సాగించాల్సిందేనంటూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా త‌న మ‌నోభిప్రాయాన్ని తెలిపారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్య‌మంపై కూడా త‌న సానుభూతిని తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం.


రైతాంగ ఉద్య‌మం విష‌యంలో ముందు దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఢిల్లీ పరిణామాల త‌ర్వాత ఎందుక‌నో వెన‌క్కి త‌గ్గారు. కొనుగోలు కేంద్రాల నిర్వ‌హ‌ణ‌ను ప్ర‌భుత్వం త‌రుపున‌ మానుకుంటున్న‌ట్లుగా కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న త‌ర్వాత పార్టీ, ప్ర‌భుత్వం ప‌నితీరు పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వానికి సానుకూలంగా సాగుతోంద‌న్న చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. అయితే ఈక్ర‌మంలో పార్టీ నేత‌లు ఏం మాట్లాడినా అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్తున్నాయ‌ని సమాచారం. వ‌రంగ‌ల్ లో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ఈ అనుభ‌వం ఎదురైన‌ట్లు స‌మాచారం.


దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీ, కేంద్రంపై విమర్శ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై కూడా పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ‌రుస‌గా చేస్తున్న కామెంట్ల‌తో పార్టీ అధిష్ఠానం, శ్రేణులు డైలామాలో ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి ఉద్య‌మం కాలం నుంచి ప‌నిచేస్తున్న సీనియ‌ర్ నాయ‌కుల్లో ఈటెల ప్ర‌ముఖుడు. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడు.. న‌మ్మ‌క‌స్తుడు కూడా. అలాంటి ఈటెల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తుండ‌టం పార్టీ నేత‌ల‌కు అంతు ప‌ట్ట‌డం లేదంట‌. అయితే ఈ వ్యాఖ్య‌లను యాదృచ్చికంగానే  చేశారో..నిజంగానే చేశారా..? అన్న కోణంలో అధిష్ఠానం ఆరా తీస్తున్న‌ట్లుగా పార్టీ ముఖ్య నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది.




గుమ్మడి కాయలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే, తినకుండా ఉండరు...

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జగన్ బొమ్మని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేకు దిమ్మతిరుగుతుందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి ఫెయిల్యూర్ కు కారణాలివేనా ? మరి పవన్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>