MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jeevitha-rajasekharf3a677d6-eed6-4339-ae24-881cb68057d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jeevitha-rajasekharf3a677d6-eed6-4339-ae24-881cb68057d8-415x250-IndiaHerald.jpgనియర్ హీరో రాజశేఖర్ ఇప్పటికీ లీడ్ రోల్స్ లలో నటించడానికే బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ నేటి ప్రేక్షకులు సీనియర్ నటులను హీరోలుగా ఒప్పుకోవడం లేదు. బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలే నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు చేయలేక చతికిలపడుతున్నారుjeevitha rajasekhar;balakrishna;nagarjuna akkineni;ram gopal varma;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;prasanth;praveen;ram pothineni;vijay;audi;cinema;vijay kumar naidu;remake;hero;prashant kishorరాజశేఖర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న జీవిత..మరి దర్శకుడు ఎందుకు వెళ్ళిపోయాడురాజశేఖర్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న జీవిత..మరి దర్శకుడు ఎందుకు వెళ్ళిపోయాడుjeevitha rajasekhar;balakrishna;nagarjuna akkineni;ram gopal varma;dr rajasekhar;jeevitha rajaseskhar;neelakanta;prasanth;praveen;ram pothineni;vijay;audi;cinema;vijay kumar naidu;remake;hero;prashant kishorWed, 03 Feb 2021 12:00:00 GMTహీరో రాజశేఖర్ ఇప్పటికీ లీడ్ రోల్స్ లలో నటించడానికే బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ నేటి ప్రేక్షకులు సీనియర్ నటులను హీరోలుగా ఒప్పుకోవడం లేదు. బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలే నేటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు చేయలేక చతికిలపడుతున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఏదో ఒక భిన్నమైన కథను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించాలని బాగా ఉబలాటపడుతున్నారు. రాజశేఖర్ రీసెంట్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి సినిమా ని చేశారు కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రాజశేఖర్ మరొక సినిమా చేయలేదు కానీ చాలా కథలను విన్నారు.

అయితే మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా రాజశేఖర్ కి బాగా నచ్చడంతో రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారు. అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసే బాధ్యతలను నీలకంఠ కు అప్పజెప్పారు. దీంతో నీలకంఠ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిర్మాతకు, నీలకంఠ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో నీలకంఠసినిమా నుంచి తప్పుకున్నారు. అయితే ఉన్నఫలంగా దర్శకుడు నీలకంఠ సినిమాని అర్ధాంతరంగా వదిలేసి వెళ్లిపోవడంతో జీవితా రాజశేఖర్ జోసెఫ్ రీమేక్ సినిమా దర్శకత్వ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నారట. నిజానికి సినిమాలను డైరెక్ట్ చేయడం జీవిత కి కొత్తేమీ కాదు. రాజశేఖర్ హీరోగా నటించిన శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి సినిమాలకు జీవిత దర్శకత్వం వహించారు.

అయితే ఆమె డైరెక్ట్ చేసిన ఈ సినిమాలన్నిటిలో ఎవడైతే నాకేంటి సినిమా ఒక్కటే యావరేజ్ గా ఆడింది. మిగిలిన అన్ని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆ సమయంలోనే రాజశేఖర్ కి గడ్డుకాలం ఏర్పడింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడవేగా సినిమాని తీసి రాజశేఖర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. కానీ కల్కి సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రాజశేఖర్ ఒక హిట్ కొట్టడం తప్పనిసరి అయ్యింది. మరి జీవిత డైరెక్ట్ చేయబోతున్న జోసెఫ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.


ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్ అదుర్స్‌... కేక పెట్టిస్తోందిగా ..!

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

టీడీపీలో మాజీ మంత్రికి కీల‌క ప‌ద‌వి... బెదిరింపుల‌కు బాబు లొంగారా ?

జ‌గ‌నోరు వ‌చ్చాక విశాఖ స్టీల్‌కు ఇన్ని కోట్ల న‌ష్టాలా... సేల్ పెట్టేసిన కేంద్రం ?

కాపు వేద‌న‌: సీమ‌లో ఈ కులం కాపుల‌ను అడ్డంగా తొక్కేస్తోందా... నోరు మెదిపే వారేరి ?

టీచర్ల వెతలు: కరోనా సాకుతో పొట్టగొడుతున్న ప్రైవేటు స్కూళ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>