Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fastagdc398265-aa7c-4f7a-ad30-f7ee44f10844-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fastagdc398265-aa7c-4f7a-ad30-f7ee44f10844-415x250-IndiaHerald.jpgటోల్ గేట్ల వద్ద ఫోర్ వీలర్ల గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త విధానమే ఫాస్టాగ్. ఈ విధానం ద్వారా ఫోర్ వీలర్ల యజమానులు టోల్ గేట్ల వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేసి వెళ్లిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా.. చెల్లింపులు కూడా సులభం అవుతాయి. అయితే దీనిపై ఇప్పటికీ ..fastag;adah sharma;delhi;india;rbi;sbi;smart phone;amazon;google;bank;hdfc;application;google pay app;central governmentఫాస్టాగ్‌పై అనుమానాలా.. అయితే ఇది మీకోసమే..ఫాస్టాగ్‌పై అనుమానాలా.. అయితే ఇది మీకోసమే..fastag;adah sharma;delhi;india;rbi;sbi;smart phone;amazon;google;bank;hdfc;application;google pay app;central governmentWed, 03 Feb 2021 22:14:11 GMTన్యూఢిల్లీ: టోల్ గేట్ల వద్ద ఫోర్ వీలర్ల గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా కేంద్రం తీసుకొచ్చిన సరికొత్త విధానమే ఫాస్టాగ్. ఈ విధానం ద్వారా ఫోర్ వీలర్ల యజమానులు టోల్ గేట్ల వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా ఆటోమేటిక్‌గా చెల్లింపులు చేసి వెళ్లిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా.. చెల్లింపులు కూడా సులభం అవుతాయి. అయితే దీనిపై ఇప్పటికీ అనేకమందికి పూర్తి అవగాహన లేకపోవడంతో దీనిని వినియోగించేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి ఫోర్ వీలర్‌‌ కలిగి ఉండి టోల్ గేట్ దాటే ప్రతిఒక్కరూ కచ్చితంగా ఫాస్టాగ్ కలిగి ఉండాలని, లేకుంటే టోల్ గేట్ దాటడం సాధ్యం కాదని వెల్లడించింది. ఈ క్రమంలో ఫాస్టాగ్‌పై ఉన్న అనుమానాలను తీర్చుకునేందుకు ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ వార్త చదవండి.

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్టాగ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానం కూడా పెరుగుతుంది. ఫాస్టాగ్ అంటే వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. ఇది ఒకసారి జారీ అయితే ఐదేళ్ల వరకు చెల్లుతుంది.

వాహనం టోల్ ప్లాజా ద్వారా వెళ్లినప్పుడు అక్కడే పై భాగంలో ఉండే ప్రత్యేక మిషన్ ఈ బార్‌కోడ్‌ను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి వాహనాన్ని ముందుకు పంపుతుంది. కోడ్ స్కార్ కాగానే దానికి అనుబంధంగా ఉన్న డిజిటల్ పేమెంట్ యాప్‌లో నుంచి నిర్ణీత అమౌంట్ టోల్ ఖాతాకు డెబిట్ అయిపోతుంది. ఫాస్టాగ్ కొనడానికి, ఒక దరఖాస్తుదారు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రం, వ్యక్తిగత గుర్తింపు కార్డును అందించాలి. పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ వాలెట్లు ఫాస్ట్ ట్యాగ్ ను అందిస్తున్నాయి. వాటిల్లో వాహన వివరాలను నమోదు చేసి సంబంధిత కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో కేవైసీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఇంటికే ఫాస్టాగ్ స్టిక్కర్ డెలివరీ అవుతుంది. దీన్ని వాహనం ముందు భాగంలోని అద్దానికి అతికించాల్సి ఉంటుంది.

ఫాస్టాగ్‌ కోసం బ్యాంకులు, ఈ-కామర్స్ ఛానెల్‌లతో సహా పలు ఏజెన్సీలతో ప్రభుత్వం భాగస్వామ్యం కలిగి ఉంది. ప్రస్తుతానికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఫాస్ట్‌ ట్యాగ్‌లను అందిస్తున్నాయి. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం, ఎయిర్‌టెల్ పేమెంట్ యాప్‌లు కూడా ఫాస్టాగ్‌ను అందిస్తున్నాయి. వీటితో పాటు భారతదేశం అంతటా కొన్ని టోల్ ప్లాజాలలో కూడా ఈ ఫాస్టాగ్ స్టిక్కర్లను కొనుక్కునే సౌలభ్యం కల్పించడం జరిగింది.

ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్‌ను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్‌ను రీచార్జి చేసుకోవచ్చు. అయితే కోర్టు జడ్జిలు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్‌ వంటి వారికి ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది.


దుమ్మురేపే బిజినెస్ చేస్తున్న ఉప్పెన సినిమా....

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...

జగడ్డ : నిమ్మగడ్డకు బీజేపీ షాక్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>