SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2f950ae6-de70-4021-b5d6-1056394e1311-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news2f950ae6-de70-4021-b5d6-1056394e1311-415x250-IndiaHerald.jpgఆస్టేలియా పర్యటనలో భాగంగా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అద్బుత విజయం సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో యువ క్రికెటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. సీనియర్ ఆటగాళ్లు దాదాపుగా అందరూ గాయాలపాలు అవ్వడంతో యువ ఆటగాళ్లు తమ సత్త నిరూపించుకునే సమయం దొరకడంతో చెలరేగిపోయారనే చెప్పాలి. ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా ఇక ఇంగ్లండ్‌ జట్టు తో స్వదేశంలో సుదీర్ఘ సిరీస్‌ కోసం సిద్ధం అవుతోంది. అయితే కంగారులను ఫేస్ దళంతో హడలెత్తించిన టీమిండియా ఇంగ్sports news;view;maya;sundar;cricket;washington sundar;australia;england;naga aswin;chennai;yuva;sardar vallabhai patel;josh;chepauk;kuldeep yadavఆసీస్ ను ఫేస్ దళంతో గెలిస్తే..ఇంగ్లాండ్ ను స్పిన్ తో చుట్టేస్తారట ..!!ఆసీస్ ను ఫేస్ దళంతో గెలిస్తే..ఇంగ్లాండ్ ను స్పిన్ తో చుట్టేస్తారట ..!!sports news;view;maya;sundar;cricket;washington sundar;australia;england;naga aswin;chennai;yuva;sardar vallabhai patel;josh;chepauk;kuldeep yadavWed, 03 Feb 2021 17:00:13 GMTయువ క్రికెటర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. సీనియర్ ఆటగాళ్లు దాదాపుగా అందరూ గాయాలపాలు అవ్వడంతో యువ ఆటగాళ్లు తమ సత్త నిరూపించుకునే సమయం దొరకడంతో చెలరేగిపోయారనే చెప్పాలి.  ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా ఇక ఇంగ్లండ్‌ జట్టు తో స్వదేశంలో  సుదీర్ఘ సిరీస్‌ కోసం సిద్ధం అవుతోంది. అయితే కంగారులను ఫేస్ దళంతో హడలెత్తించిన టీమిండియా ఇంగ్లీష్ జట్టును స్పిన్ తో మాయ చేసేందుకు సిద్దం అవుతుంది..

ఈ నెల 5వ తేదీ నుండి ఇంగ్లండ్‌తో టీమిండియా  చెన్నై లోని చెపాక్ స్టేడియం శుక్రవారం మొదటి టెస్ట్ తో తలపడనుంది. గత వారం కిందటే ఇరు జట్లు కూడా చెన్నై చేరుకుని కరోనా నిబంధనల ప్రకారం బయో బబుల్ లో ఉన్నారు. అయితే 2వ తేదీకి క్వారెంటైన్ రోజులు పూర్తి కావడంతో తాజాగా రెండు జట్లు కూడా గ్రౌండ్ లో దిగి ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి. కంగారులను ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌తో హడలెత్తించిన టీమిండియా ఈసారి స్వదేశం లో పిచ్ లు దాదాపుగా స్పిన్ కు అనుకూలంగా ఉన్నందున ఇంగ్లీష్ ఆటగాళ్లను స్పిన్‌తో చుట్టేసేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. దానిలో భాగంగా ముగ్గురు స్పిన్నర్ల తో బరిలోకి దిగానున్నట్లు సమాచారం.

ఆసీస్ సిరీస్‌లో అదరగొట్టిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు కుల్దీప్ యాదవ్‌ కూడా మొదటి టెస్ట్ లో స్థానం దొరికే ఛాన్స్ ఉంది.వీరితో పాటుగా ఇక మరో స్పిన్నర్ స్థానం కోసం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఆసీస్ సిరీస్‌లో బ్యాటింగ్‌తోనూ అదరగొట్టిన సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయని క్రికెట్ పండితులు తెలుపుతున్నారు. కాగా టీమిండియా లో లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్‌ కొరత ఉండడంతో కనీసం ఒక్కరినైనా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను బరిలోకి దించాలని సెలక్టర్లు భావిస్తే అక్షర్‌కు అవకాశం లభించవచ్చని విశ్లేషకులు తెలుపుతున్నారు. అయితే కరోనా తరువాత మొదలవుతున్న సిసలైన టోర్నీ కావడంతో ఈ సిరీస్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరి రెండు జట్లు కూడా మంచి ఫామ్ లో ఉండడంతో ఇరు జట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


మహేష్ బాబు పై నమోదైన పోలీస్ కేసు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆ నిర్మాత..

బ్రాహ్మణ ఘోష: వీళ్ళ బాధ జగన్ దృష్టికి రాలేదా...?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>