MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/will-kannada-heroes-come-to-usf4b8357e-c420-4e0e-9d84-781bc736a8fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/will-kannada-heroes-come-to-usf4b8357e-c420-4e0e-9d84-781bc736a8fc-415x250-IndiaHerald.jpgతెలుగు హీరోలు ఎప్పటినుంచో కన్నడ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. అక్కడ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు హీరోలకు పోటీగా కన్నడ స్టార్లు కూడా టాలీవుడ్‌కి వస్తున్నారు. యశ్‌ ఇచ్చిన ధైర్యంతో తెలుగు మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. మరి శాండల్‌వుడ్‌ స్టార్లంతా రాకీ భాయ్‌లు కాగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. will kannada heroes come to us;kumaar;raaj kumar;rocky;puneet rajkumar;raj;rashmika mandanna;tollywood;telugu;kollywood;dhruv;kannada;hero;vegetable market;yuvaratnaకన్నడ హీరోలు మన దగ్గరకు రావడమా..?కన్నడ హీరోలు మన దగ్గరకు రావడమా..?will kannada heroes come to us;kumaar;raaj kumar;rocky;puneet rajkumar;raj;rashmika mandanna;tollywood;telugu;kollywood;dhruv;kannada;hero;vegetable market;yuvaratnaWed, 03 Feb 2021 14:00:00 GMTకన్నడ ఇండస్ట్రీకి వెళ్తున్నారు. అక్కడ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు హీరోలకు పోటీగా కన్నడ స్టార్లు కూడా టాలీవుడ్‌కి వస్తున్నారు. యశ్‌ ఇచ్చిన ధైర్యంతో తెలుగు మార్కెట్‌లో అడుగుపెడుతున్నారు. మరి శాండల్‌వుడ్‌ స్టార్లంతా రాకీ భాయ్‌లు కాగలరా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

'కె.జి.ఎఫ్.'తో యశ్‌కి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఒకే ఒక్క సినిమాతో తెలుగు మార్కెట్‌లో ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఎఫెక్ట్‌తో కన్నడనాట యశ్‌ రెమ్యునరేషన్‌ భారీగా పెరిగిందట. దీంతో కన్నడ స్టార్లంతా రెమ్యునరేషన్‌ పెంచుకోవడానికి టాలీవుడ్ లో ల్యాండ్‌ అవుతున్నారు. డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

కన్నడ టాప్ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కి కర్నాటకలో తప్ప మిగతా చోట్ల పెద్దగా మార్కెట్‌ లేదు. అందుకే కన్నడలో యశ్‌ కంటే పెద్ద హీరో అయినా రెమ్యునరేషన్‌ యశ్‌ కంటే వెనకబడ్డాడు పునీత్. ఇక మార్కెట్‌ పెంచుకోకపోతే టాప్‌ ఛైర్‌ కూడా పోతుందేమో అని భయపడుతున్నాడట పునీత్. అందుకే 'యువరత్న' సినిమాతో తెలుగు మార్కెట్‌కి వస్తున్నాడు పునీత్ రాజ్‌కుమార్.

అర్జున్‌ మేనళ్లుడు ధృవ్ సార్జా కూడా టాలీవుడ్‌కి వస్తున్నాడు. రష్మిక మందన్న సాయంతో 'పొగరు' సినిమాని తెలుగులో డబ్‌ చేస్తున్నాడు. పునీత్, ధృవ్‌ మాత్రమే కాదు, కన్నడలో కొంచెం గుర్తింపు ఉన్న హీరోలంతా మార్కెట్‌ పెంచుకోవడానికి టాలీవుడ్‌కి వస్తున్నారు. అయితే కన్నడ సినిమాల్లో క్వాలిటీ కొంచెం తక్కువ అనే విమర్శలున్నాయి. మరి ఈ కామెంట్స్‌ని ఓవర్‌ కమ్‌ చేసి తెలుగులో ఎలా మార్కెట్ తెచ్చుకుంటారో చూడాలి.

మొత్తానికి తెలుగు మార్కెట్ పై కన్నడ హీరోలు ఫోకస్ పెడుతున్నారు. తెలుగులో కన్నడబ్బింగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ తమ సత్తా చాటుతున్నారు. యువరత్న సినిమాతో టాలీవుడ్ కి వచ్చేస్తున్న పునీత్ పై ఎన్నో అంచనాలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ కు కోలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ ఉండటమే కారణం.





బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణ‌ల విష‌యంలో బాబుకు మాత్రం బాధ్య‌త లేదా ?

రజనీ రాననలేదట.. మళ్లీ మెలికేనా..!

జగడ్డ: నిమ్మగడ్డ నిమ్మాడ ఎందుకు వెళ్లలేదో తెలుసా...కారణం వింటే షాక్...?

కాపు వేద‌న‌: జ‌గ‌న్ ఇలాకాలో 35 వేల ఓట్లున్న కాపులకు ఇంత అన్యాయ‌మా ?

జగడ్డ: జగన్ పై కోపంతో పంచాయతీ ఎన్నికల్ని లైట్ తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ vs వైసీపీ vs వైసీపీ... త‌ల ప‌ట్టుకుంటోన్న లేడీ ఎమ్మెల్యే ?

30 ఏళ్లుగా మెగాస్టార్ డూప్ గా నటిస్తున్న ప్రేమ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>