PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/more-economical-problems-for-ap3bcbf570-8fd4-4afc-bc2d-01ba23911b98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/more-economical-problems-for-ap3bcbf570-8fd4-4afc-bc2d-01ba23911b98-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతం అవుతోంది రాష్ట్రం. విభజన తర్వాత రెవెన్యూ ఆదాయంలో భారీగా కోతపడగా.. ఇప్పుడు దానికితోడు ఇతర కష్టాలు వెంటాడుతున్నాయి. అటు సాయం చేసేందుకు ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం, పన్నుల వాతలు పెట్టాడనికి మాత్రం ఉత్సాహం చూపిస్తోంది. అగ్రి సెస్ పేరుతో ఏపీపై మరో పిడుగు పడేసింది. ap economic problems;suma;suma kanakala;andhra pradesh;agri;petrol;diesel;minister;silver;central governmentఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?ఏపీకి మరిన్ని ఆర్థిక కష్టాలు రాబోతున్నాయా..?ap economic problems;suma;suma kanakala;andhra pradesh;agri;petrol;diesel;minister;silver;central governmentWed, 03 Feb 2021 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం, పన్నుల వాతలు పెట్టాడనికి మాత్రం ఉత్సాహం చూపిస్తోంది. అగ్రి సెస్ పేరుతో ఏపీపై మరో పిడుగు పడేసింది.

వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో అగ్రి సెస్‌ ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్‌ తో పాటు బంగారం, వెండి తదితర 12 వస్తువులపై ఈ సెస్‌ విధిస్తారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ సెస్ కారణంగా వినియోగదారులపై భారం పడకుండా.. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో సర్దుబాటు చేస్తామని వివరణ ఇచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంటే అగ్రిసెస్ తో వెంటనే ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. రాను రాను దాన్ని జనాలకు అలవాటు చేస్తారు. ఈ క్రమంలో ప్రజలపై భారం వేయకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వ వాటాల్లోనే కోతపెడుతోంది కేంద్రం.

సాధారణంగా కేంద్ర పన్నుల్లో 41% రాష్ట్రాల వాటాగా ఉంటుంది. కానీ, సర్ ‌చార్జ్ ‌లు, సెస్ ‌ల విషయంలో రాష్ట్రాలకు వాటా లభించదు. అంటే అగ్రి సెస్ పేరుతో వేసే అదనపు రుసుముల్లో ఏపీకి వాటా ఉండదనమాట. ఆమేరకు రేట్లు పెరగకుండా చేస్తామంటూ కేంద్రం ఆడుతున్న డ్రామా కారణంగా.. కస్టమ్స్, ఎక్సైజ్‌ సుంకాలలో వాటా ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. కేవలం, పెట్రోల్, డీజిల్ లో సర్దుబాటు వల్లే దాదాపుగా 2వేల కోట్లరూపాయల ఆదాయాన్ని ఏపీ కేంద్రానికి సమర్పించుకోవాల్సి ఉంటుంది.

అగ్రి సెస్ ద్వారా రాష్ట్రాలకు  ప్రత్యక్ష ప్రయోజనం ఉండదు. పైగా ఈ సెస్‌ వల్ల కేంద్రం సేకరించే కస్టమ్స్‌ డ్యూటీ నుంచి రాష్ట్రాలు తమ వాటా ఆదాయాన్ని కోల్పోతాయి. గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు లెక్కలోకి తీసుకుంటే అగ్రి సెస్‌ రూపంలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు ద్వారా కేంద్రానికి రూ.2,016.33 కోట్ల ఆదాయం ఏపీనుంచి సమకూరే అవకాశం ఉంది. అంటే ఈ ఆదాయం అగ్రి సెస్ రూపంలో కేంద్రానికి వెళ్తుంది. అదే సమయంలో వినియోగదారులపై భారం పడదు. అంకే కేవలం పెట్రోల్, డీజిల్ పై అగ్రి సెస్ కారణంగా 2వేల కోట్ల రూపాయల పైగా ఆదాయాన్ని ఏపీ కోల్పోతుంది. మిగతా 10 వస్తువులను కూడా లెక్కలోకి తీసుకుంటే ఇది మరింత పెరిగే అవకాశముంది. 


అమెజాన్ సీఈవో సంచలనం!

షాకింగ్‌: టీడీపీ నేత పట్టాభిపై దాడి చేయించింది చంద్రబాబేనా..?

టీఆర్ఎస్‌లో ఈటెల తిరుగుబాటు వ్యాఖ్య‌లు... సంచల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న మంత్రి..

జగడ్డ: ఆనాటి జగన్‌ డైలాగ్‌.. ఈనాడు అచ్చెన్న నోట..?

హెరాల్డ్ సెటైర్ : కాబోయే హోంమంత్రికి పద్నాలుగు రోజుల రిమాండ్

సారీ ఇండియా.. లెంపలేసుకున్న అమెరికా.. ఎందుకంటే..?

పాపం.. అఖిలప్రియ భర్త, తమ్ముడు.. చివరకి అదొక్కటే దిక్కా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>