Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్ 3(2)(ఈ), సెక్షన్ 3(2)(సీ) ప్రకారం మన దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులను నిర్బంధించి, మన దేశం నుంచి పంపించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని నిత్యానంద రాయ్ చెప్పారు. రొహింగ్యా వలసదారుల జాతీయతను సరైన పక్రియ ద్వారా సరిచూసి, తనిఖీ చేసి, చట్టవిరుద్ధంగా మన దేశంలో ఉన్నవారిని నిర్బంధించి, దేశం నుంచి పంపించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. పాస్‌పోర్టు లేకుండా మన దేశంలో ప్రవేశించిన ఏ వ్యక్తినైనా తరలించాలని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. భారత nithyanandh;anil music;india;mp;minister;shiv sena;central governmentహోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సంచలన వ్యాఖ్యలుహోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సంచలన వ్యాఖ్యలుnithyanandh;anil music;india;mp;minister;shiv sena;central governmentWed, 03 Feb 2021 23:14:59 GMTమంత్రి నిత్యానంద రాయ్  సంచలన వ్యాఖ్యలు....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

అక్రమంగా మన దేశంలో ఉంటున్న విదేశీయులను నిర్బంధించి, దేశం నుంచి పంపించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. రొహింగ్యాలను మన దేశం నుంచి పంపించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి రాజ్యసభకు లిఖితపూర్వకంగా బుధవారం వివరించారు. శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సమాధానాన్ని ఇచ్చింది.


ఫారినర్స్ యాక్ట్‌లోని సెక్షన్ 3(2)(ఈ), సెక్షన్ 3(2)(సీ) ప్రకారం మన దేశంలో చట్ట విరుద్ధంగా ఉంటున్న విదేశీయులను నిర్బంధించి, మన దేశం నుంచి పంపించే అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని నిత్యానంద రాయ్ చెప్పారు.


రొహింగ్యా వలసదారుల జాతీయతను సరైన పక్రియ ద్వారా సరిచూసి, తనిఖీ చేసి, చట్టవిరుద్ధంగా మన దేశంలో ఉన్నవారిని నిర్బంధించి, దేశం నుంచి పంపించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. పాస్‌పోర్టు లేకుండా మన దేశంలో ప్రవేశించిన ఏ వ్యక్తినైనా తరలించాలని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 239(1) ప్రకారం ఈ అధికారాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించాలని అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఆదేశాలు 1958 నుంచి ఇస్తున్నట్లు వివరించారు.

చట్టవిరుద్ధంగా మన దేశంలో ఉంటున్న వలసదారుల సంఖ్యపై స్పష్టత లేదని చెప్పారు. వీరు చెల్లుబాటయ్యే ప్రయాణ పత్రాలతో రావడం లేదని, అందువల్ల కచ్చితమైన వివరాలు తెలియడం లేదని తెలిపారు.

రొహింగ్యా ముస్లింలు పెద్ద సంఖ్యలో మన దేశంలోకి వస్తున్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? అని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రశ్నించారు. అలాంటి వలసదారులు ప్రవేశించడాన్ని మొదట్లోనే సరిహద్దుల్లోని భద్రతా దళాలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయని అడిగారు. వారిని మన దేశం ఎంత కాలం భరిస్తుందని ప్రశ్నించారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 


ఆ రహస్యం బయటపడింది.. ఇక పాకిస్తాన్‌ కొంపకొల్లేరే..?

యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>