MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-manols-are-crazy-hero-prabhas68103d45-91c1-4866-b87b-fda1cfc2fd40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/why-manols-are-crazy-hero-prabhas68103d45-91c1-4866-b87b-fda1cfc2fd40-415x250-IndiaHerald.jpgసౌత్‌ ఇండియన్ మూవీస్‌కి బౌండరీస్‌ చెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు లోకల్‌ మార్కెట్‌నే ఫోకస్‌ చేసిన సౌత్‌ స్టార్స్‌ ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. నార్త్‌లోనూ టాలెంట్‌ చూపించడానికి రెడీ అవుతున్నారు. అక్కడి సిట్యువేషన్స్‌ని వాడుకుంటూ, ఉత్తరాదిలోనూ జండా పాతుతున్నారు దక్షిణాది హీరోలు. తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ప్రభాస్‌ నుంచి ధనుష్‌ వరకు అంతా పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ పెడుతున్నారు. సౌత్‌ స్టోరీస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్why manols are crazy hero prabhas;ntr;ram charan teja;allu arjun;jr ntr;ram pothineni;rajamouli;vijay;vijay deverakonda;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;vegetable market;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;indian;devarakondaమనోళ్లకు ఎందుకంత మోజు..!మనోళ్లకు ఎందుకంత మోజు..!why manols are crazy hero prabhas;ntr;ram charan teja;allu arjun;jr ntr;ram pothineni;rajamouli;vijay;vijay deverakonda;cinema;telugu;bahubali;tamil;kannada;hindi;vegetable market;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;indian;devarakondaWed, 03 Feb 2021 16:00:00 GMTఇండియన్ మూవీస్‌కి బౌండరీస్‌ చెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు లోకల్‌ మార్కెట్‌నే ఫోకస్‌ చేసిన సౌత్‌ స్టార్స్‌ ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. నార్త్‌లోనూ టాలెంట్‌ చూపించడానికి రెడీ అవుతున్నారు. అక్కడి సిట్యువేషన్స్‌ని వాడుకుంటూ, ఉత్తరాదిలోనూ జండా పాతుతున్నారు దక్షిణాది హీరోలు.

తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ప్రభాస్‌ నుంచి ధనుష్‌ వరకు అంతా పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ పెడుతున్నారు. సౌత్‌ స్టోరీస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ మూడు పాన్‌ ఇండియన్‌ మూవీస్ ప్రిపేర్ చేస్తోంటే, బాహుబలి రూట్‌లో మరికొంతమంది నార్త్‌కి వెళ్తున్నారు.

టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మార్కెట్‌ పెంచుకునే పనిలో పడ్డారు. తెలుగు నుంచి హిందీ బెల్ట్‌ వరకు స్టార్డమ్‌ని విస్తరించుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్‌ ఇండియన్‌ మూవీ 'ట్రిపుల్ ఆర్'తో నార్త్‌కి వెళ్తున్నారు తారక్, చరణ్. ఇప్పటికే రిలీజైన టీజర్స్‌తో బీటౌన్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

తెలుగుతోపాటు మళయాళంలోనూ క్రేజీ మార్కెట్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు నార్త్‌లోనూ హంగామా చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే 'పుష్ప' సినిమాని పాన్‌ ఇండియన్ మూవీగా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.

కెరీర్‌ బిగినింగ్‌లో సౌత్‌ స్టార్‌ అనిపించుకోవాలనుకున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 'లైగర్‌' సినిమాతో నార్త్‌కి వెళ్తున్నాడు విజయ్. అయితే మల్టీలింగ్వల్‌గా రిలీజైన 'నోటా, డియర్‌ కామ్రేడ్' సినిమాలకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మరి ఈ 'లైగర్' విజయ్‌కి పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ తీసుకొస్తాడా అన్నది చూడాలి. మొత్తానికి దక్షిణాది హీరోలు ఉత్తరాదిన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.




గోధుమ నారు దాచుకున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

అల్లుఅర్జున్ ఆ సినిమాలను వదులుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

చెప్పుల దండ‌: అంబేడ్క‌ర్ ప్లేస్‌లో రాజ‌న్న‌.. ఎన్టీఆర్ ఉంటే.. ఏమ‌య్యేది ?

జగడ్డ : ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు... బ్రహ్మాస్త్రమే....?

జాన్వీ లవ్ పై ఆసక్తికర విషయం..!

యాంకర్ ప్రదీప్ నటించిన సినిమాను ముందు ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..??

హెరాల్డ్ సెటైర్: జగన్ మరో చంద్రబాబు అవుతారా ఏంటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>