PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yeluri-sambasivaraoe4190056-e0ec-4ad7-882b-899dbe515540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/yeluri-sambasivaraoe4190056-e0ec-4ad7-882b-899dbe515540-415x250-IndiaHerald.jpgప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గ్రామాల్లో టీడీపీ స‌త్తా చాట‌నుందా ? ఇక్కడ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీడీపీ నాయ‌కుడు, యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. దూకుడు పెంచుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతోపాటు.. గ్రామీణ ప్రాంతాల‌కు ఆయ‌న అభివృద్ధి ఫ‌లాల‌ను అందిస్తున్నారు. గ‌త 2014లో విజ‌యం సాధించిన ఏలూరి.. టీడీపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రైతులు ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్న సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి వెనుyeluri sambasivarao;district;mla;cheque;letter;tdp;yuva;ycp;partyఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?ఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?yeluri sambasivarao;district;mla;cheque;letter;tdp;yuva;ycp;partyWed, 03 Feb 2021 00:00:00 GMTజిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గ్రామాల్లో టీడీపీ స‌త్తా చాట‌నుందా ? ఇక్కడ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న టీడీపీ నాయ‌కుడు, యువ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. దూకుడు పెంచుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌రుస ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డంతోపాటు.. గ్రామీణ ప్రాంతాల‌కు ఆయ‌న అభివృద్ధి ఫ‌లాల‌ను అందిస్తున్నారు. గ‌త 2014లో విజ‌యం సాధించిన ఏలూరి.. టీడీపీ అధికారంలో ఉన్న నేప‌థ్యంలో రైతులు ప్ర‌ధానంగా డిమాండ్ చేస్తున్న సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి వెనుక‌బ‌డిన ప్రాజెక్టులు ప్రాణం పోసుకున్నాయి.

ఇక‌, రైతుల‌కు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చేందుకు ప్ర‌త్యేకంగా త‌న కార్యాల‌యంలోనే స‌ల‌హా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్ర‌భుత్వంతో చ‌ర్చించి.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పాటుప‌డ్డారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లోనూ ఏలూరి సాంబ‌శివ‌రావు విజ‌యం సాధించారు. అయితే.. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అయినా.. కూడా ఎన్నారైల నుంచి నిధులు సేక‌రించి.. మ‌రీ .. రైతుల అభ్యున్న‌తికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎక్కువ భాగం ఆయ‌న గ్రామీణ ప్రాంతాల్లోనే ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుని రైతులు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఫ‌లితంగా ఏలూరి సాంబ‌శివ‌రావు పేరు జోరుగా వినిపిస్తోంది.

ఇక‌, ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏలూరి హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్ర‌జానాయ‌కుడిగా.. గ్రామాల‌పై శ్ర‌ద్ధ పెట్టిన యువ నేత‌గా, ముఖ్యంగా రైతుల‌కు అన్ని విధాలా సాయం చేస్తున్న ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా ఏలూరి సాంబ‌శివ‌రావు ముద్ర‌వేసుకున్నారు. దీంతో ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా గ్రామ పంచాయ‌తీలూ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా వైసీపీ కొన్నిచోట్ల పంచాయితీలని టీడీపీ అభ్యర్ధులని తప్పించి ఎక్కువ ఏకగ్రీవాలు చేసుకోవాలని చూశారు. కానీ ఎమ్మెల్యే  ఏలూరి వైసీపీకి చెక్ పెట్టేసి, టీడీపీ అభ్యర్ధులని పోటీలో ఉంచారు. మొత్తానికైతే పరుచూరులో మెజారిటీ గ్రామాలు టీడీపీ కైవ‌సం చేసుకోవ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>