PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9badd392-d160-445b-8912-4080e8b3ab39-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections9badd392-d160-445b-8912-4080e8b3ab39-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి క్రమంగా మారుతోంది. సాధారణంగా ఆ పదవిలో ఉన్నవారు.. నామమాత్రంగా వ్యవహరిస్తారు. కానీ.. నిమ్మగడ్డ ఏపీ సీఎంతో వైరం కొద్దీ స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు. తనను టార్గెట్ చేశారన్న కోపంతో.. ఇటీవల ఇంకా యాక్టివ్ గా మారారు. అంతవరకూ అంతా ఊహించిందే.. కానీ.. ఇప్పుడు ఆయన మరి కాస్త యాక్టివ్ గా మారిపోయారు. చివరకు పంచాయతీ ఎన్నికల గొడవల కారణంగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. ఆ గ్రామంలో కూడా పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరణించిన వ్యక్తి jagan-nimmagadda-elections;kumaar;godavari river;andhra pradesh;cm;panchayati;village;husband;ycp;partyజగడ్డ: క్రమంగా రాజకీయనేతగా మారిపోతున్న నిమ్మగడ్డ..?జగడ్డ: క్రమంగా రాజకీయనేతగా మారిపోతున్న నిమ్మగడ్డ..?jagan-nimmagadda-elections;kumaar;godavari river;andhra pradesh;cm;panchayati;village;husband;ycp;partyWed, 03 Feb 2021 06:00:00 GMTకుమార్ వ్యవహారశైలి క్రమంగా మారుతోంది. సాధారణంగా ఆ పదవిలో ఉన్నవారు.. నామమాత్రంగా వ్యవహరిస్తారు. కానీ.. నిమ్మగడ్డ ఏపీ సీఎంతో వైరం కొద్దీ స్వతంత్ర్యంగా వ్యవహరిస్తున్నారు. తనను టార్గెట్ చేశారన్న కోపంతో.. ఇటీవల ఇంకా యాక్టివ్ గా మారారు. అంతవరకూ అంతా ఊహించిందే.. కానీ.. ఇప్పుడు ఆయన మరి కాస్త యాక్టివ్ గా మారిపోయారు.

చివరకు పంచాయతీ ఎన్నికల గొడవల కారణంగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే.. ఆ గ్రామంలో కూడా పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరామర్శించారు..  సాధారణంగా ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు ఇలాంటి పర్యటనలు చేయడం చాలా అరుదు. ఇలాంటి ఘటనలు జరిగితే విచారణకు ఆదేశించడమో.. సదరు ఎస్పీని పిలిపించి మాట్లాడటమో చేస్తుంటారు.

అంతే తప్ప.. నేరుగా బాధితులను రాజకీయ నేతల్లా పరామర్శించడం చాలా అరుదు.. ఈ వ్యవహార శైలి చూసి ఇప్పుడు వైసీపీ నాయకులు విమర్శల డోసు పెంచారు.. నిమ్మగడ్డ ఓ ఎన్నికల సంఘం కమిషనర్‌ గా కాకుండా.. ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా మారిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థి భర్త అనుమానస్పద స్థితిలో మృతి చెందితే దాన్ని రాజకీయం చేసేందుకు ఎస్‌ఈసీ హుటాహుటిన వెళ్లారని తప్పుపట్టారు.

అదే ఎస్‌ఈసీ అచ్చెన్నాయుడి స్వగ్రామం నిమ్మాడ ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఊదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు వైసీపీ నేతలు.. మరి నిమ్మగడ్డ పూర్తిగా ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయారా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. దీనికి తోడు ఇప్పుడు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సొంతంగా ఎన్నికల కోసం ఓ యాప్ రూపొందించం కూడా వైసీపీని కక్ష సాధించేందుకే అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.  




ఆ హీరోయిన్ కు తెలుగు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు దక్కక పోవడానికి కారణం ఏంటో మరి..!!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>